Ajay Bhupathi :సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని చెప్పడానికి ఇది మరొక ఎగ్జాంపుల్. భారీ భారీ బడ్జెట్లో .. భారీ భారీ కాన్సెప్ట్ లో తెరకెక్కిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సినిమాలు చిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ అయి డైరెక్టర్ కి మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు నిర్మాతలకు కోట్ల లాభాలు తీసుకొస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కధ బాగున్న.. కాన్సెప్ట్ బాగున్న కొన్ని కొన్ని కారణాల చేత సినిమా ఫ్లాప్ అవుతూ ఉంటుంది. ఆ లిస్టులోకే వస్తుంది “శ్రీనివాస మంగాపురం” సినిమా. టాలీవుడ్ లో తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన రీసెంట్ మూవీ “శ్రీనివాస మంగాపురం”. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో ఘట్టమనేని కుటుంబానికి చెందిన జయకృష్ణ హీరోగా, బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రాషా థడానీ కథానాయకగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
ALSO READ:Ali:‘నన్ను కరివేపాకులా తీసి పారేశారు’.. మనసులోని బాధని బయటపెట్టిన నటుడు అలీ..!
సినిమా అట్టర్ ఫ్లాప్:
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ తో పాటు సాంగ్స్ పై కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. జై కృష్ణ , రాషా తమ తొలి సినిమాతోనే నటన స్క్రీన్ ప్రజెన్స్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ కథనం నెమ్మదిగా సాగడం.. స్క్రీన్ ప్లే లో కొత్తదనం లోపించడం సినిమాకు నెగిటివ్గా మారినట్లు ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది. యాక్షన్ సన్నివేశాలు అనుకున్నప్పటికీ ఓవరాల్ గా మిశ్రమ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.
ALSO READ:OTT:నో ముద్దులు, నో ఫైట్ సీన్స్..అయినా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇది!
పరాజయంపై అజయ్ భూపతి కీలక వ్యాఖ్యలు:
సినిమా ఫలితం పై దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi )సోషల్ మీడియా వేదికగా స్పందించారు. శ్రీనివాస మంగాపురం తనకు ఎంతో ప్రత్యేకమైన చిత్రమని పేర్కొంటూ.. సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత నాదేనని స్పష్టం చేశారు. జయకృష్ణ – రాషా థడానీ లతో పనిచేసిన సమయంలో వారు కొత్త నటులనే భావనకు తనకు కలగలేదని.. ఇద్దరు చాలా ఎక్స్పీరియన్స్ గా కష్టపడ్డారని ప్రశంసించారు. అలాగే నిర్మాత అశ్వినీదత్, జెమినీ కిరణ్ తో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు . తన వెంట నిలిచిన ప్రతి నటీనటులకు, సాంకేత నిపుణులకు, నిర్మాతలకు, చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంగళవారం సీక్వెల్ పై ఫోకస్:
సినిమా పరాజయాన్ని ఓపెన్ గా అంగీకరించిన అజయ్ భూపతి వైఖరిని నెటిజన్లు, సినీ అభిమానులు అభినందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమా ఫ్లాప్ అయిన కొంతమంది సూపర్ సక్సెస్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అని కానీ అలా కాకుండా జనాల ఒపీనియన్ హ్యాపీగా స్వీకరించారు అని ..అజయ్ భూపతి గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ పరాజయాన్ని ఒక పాఠంగా తీసుకొని మరింత బలంగా తిరిగి వస్తానని ఆయన చెప్పిన విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు..!!
#SrinivasaMangapuram is a very special film for me. It has given me so many emotions and memories that I will always cherish.
Working with #JayaKrishna & #Rasha never felt like working with newcomers… they gave their best. Working with #AshwiniDutt Garu was also a great…
— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 8, 2026




