Thursday, September 17, 2026
HomeLATESTHero Karthikeya:హీరో కార్తికేయ డైరెక్టర్‌గా ఎంట్రీ.. తొలి సినిమాతోనే భారీ సర్‌ప్రైజ్!

Hero Karthikeya:హీరో కార్తికేయ డైరెక్టర్‌గా ఎంట్రీ.. తొలి సినిమాతోనే భారీ సర్‌ప్రైజ్!

Hero Karthikeya:యువ హీరో కార్తికేయ గుమ్మకొండ కొత్త అవతారం ఎత్తారు.ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను చాలా సింపుల్‌గా నిర్వహించారు

on
- Advertisement -banner Ad

Hero Karthikeya:సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. పరిస్థితులు తారుమారవచ్చు. ఏదోగా ఉన్న వ్యక్తి టాప్‌కు వెళ్లిపోవచ్చు. అసలు స్టార్ట్ అవుతాడని అనుకోని హీరో స్టార్ అయిపోవచ్చు. ఏదీ ముందుగా తెలియదు. ఈ మధ్యకాలంలో ఇలాంటి విషయాలను చాలా చూశాం. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు నిర్మాతలుగా మారడం, డైరెక్టర్లుగా మారడం మనం చూస్తూనే వచ్చాం. అయితే ఇప్పుడు మాత్రం ఓ హీరో డైరెక్టర్‌గా మారాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హీరోగా, విలన్‌గా ట్రై చేసిన కార్తికేయ..:

‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కార్తికేయ(Hero Karthikeya) అందరికీ గుర్తుండే ఉంటాడు. ఆయనను మర్చిపోయినట్టుగా అనిపించినా, ఆయన మాత్రం బాగానే సినిమాలు చేస్తూ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ఎదగడానికి ట్రై చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయాడు. ఈ క్రమంలోనే కార్తికేయ తన రూట్ మార్చారు.

- Advertisement -
Advertisement

మొదట సినిమాల్లో హీరోగా చేసి, ఆ తర్వాత విలన్‌గా కూడా ట్రై చేసిన కార్తికేయకు ఎక్కడా సరైన బ్రేక్ రాకపోవడంతో ఇప్పుడు తన రూట్ మార్చుకుంటూ దర్శకుడిగా మారనున్నారు. దీనికి సంబంధించిన విషయాలను కూడా ఆయన బయటపెట్టారు.

సొంత కథతో దర్శకుడిగా..:

కార్తికేయ తన సొంత కథతో, స్వీయ నిర్మాణంలో దర్శకుడిగా మారనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను చాలా సింపుల్‌గా నిర్వహించారు. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి? ఇందులో హీరో, హీరోయిన్ ఎవరు? సినిమాలో ఎలాంటి స్పెషల్ కంటెంట్ ఉండబోతుంది? అనే విషయాలను మాత్రం త్వరలోనే ప్రకటించబోతున్నామని తెలిపారు.పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించి, షూటింగ్ ప్రారంభిస్తామని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:గురువారం బుల్లితెరపై..టీవీ సినిమాలు!

కార్తికేయ నిర్ణయంపై ఫ్యాన్స్ రియాక్షన్:

కార్తికేయ సడన్‌గా దర్శకుడిగా మారడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. హీరోగా కొనసాగుతున్న ఆయన ఒక్కసారిగా మెగాఫోన్ పట్టుకోవడంతో ప్రేక్షకులు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ‘హీరోగా మరికొంతకాలం ప్రయత్నించి ఉంటే బాగుండేది.. ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం కార్తికేయలో మంచి టాలెంట్ ఉందని, హీరోగా ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోయినా దర్శకుడిగా తన సత్తా చాటే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రయత్నంతో ఆయన తన కెరీర్‌కు మరో మలుపు ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. దర్శకుడిగా తన ఆలోచనలను తెరపై ఎలా చూపిస్తారో చూడాలని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త ప్రయాణంలో కార్తికేయకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Actress Ambika:త్రిష -విజయ్ పై నటి అంబిక షాకింగ్ కామెంట్స్..!

సినిమా ఎలా ఉండబోతుందో.. వేచి చూడాల్సిందే!:

మరి కార్తికేయ తీసుకున్న ఈ బోల్డ్ డెసీషన్ ఆయన కెరీర్‌ను ఎంతవరకు మలుపు తిప్పుతుందో చూడాలి. అసలు ఈ సినిమాలో హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? ఎలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాబోతోంది? అనే విషయాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you