Amitabh Bachchan:బాలీవుడ్ సినీ పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన నటులలో అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటించే నటుడుగా పేరు సంపాదించారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా అందరిని భయభ్రాంతులకు గురిచేసిన విషయం ఏమిటంటే హీరో టైగర్ ష్రాఫ్ పైన కొంతమంది యువకులు కాల్పులు జరపడంతో ఈ ఘటనలో హీరోకి స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో అప్పటినుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురవ్వడమే కాకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు సెలబ్రిటీలు.
కట్టుదిట్టమైన భద్రతల నడుమ బయటకు వచ్చిన అమితాబ్..
బాలీవుడ్ లో ప్రముఖ తారలు మునుపెన్నడు లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమితాబ్ బచ్చన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయం నడుమ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసం జల్సా వెలువల ప్రతి ఆదివారం సాయంత్రం ఒక ప్రత్యేకమైన సీన్ కనిపించేది. దేశ నలుమూలల నుంచి వచ్చిన అభిమానులను గేటు దగ్గరకు వచ్చి మరి స్వయంగా అభివాదం చేయడం కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నారు. తమ అభిమాన హీరోని చూడడానికి కూడా చాలామంది అభిమానులు ఎంతో ప్రేమగా వస్తూ ఉంటారు.
ALSO READ:Ramayana:రామాయణం నటీనటుల రెమ్యునరేషన్లు.. ఎవరికి ఎన్ని కోట్లు ఇస్తున్నారో తెలుసా?
టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. భయాందోళనలో సెలబ్రిటీలు.
ఇటీవలే హీరో టైగర్ ష్రాఫ్ వాహనం పైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరపడంతో అమితాబ్ నివాసానికి కూడా బాంబు బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు భద్రతను మరింత పెంచేశారు. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన ఫ్యాన్స్ మీట్లో ఊహించిన దృశ్యాలను బయటకు వచ్చాయి. గతంలో ఎంతో స్వేచ్ఛగా బయటికి వచ్చి అభిమానులను పలకరించే అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan).. ఈసారి మూడువైపులా పూర్తిగా కవర్ చేసేలా ఏర్పాటు చేసినటువంటి ఒక పారదర్శక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్ వెనుక నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఆయనకు రక్షణగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా పక్కన నిలబడి మరి ఆ పరిసరాలను గమనిస్తూ ఉన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Bigg Boss 10:రోహిత్‌ను దెబ్బకొట్టిన వాళ్లెవరు? బయటకొచ్చాక సంచలన కామెంట్స్!
అమితాబ్ బచ్చన్ చిత్రాలు, షోలు..
ఈ విషయాలను బట్టి చూస్తూ ఉంటే బాలీవుడ్ పరిశ్రమలో టైగర్ ష్రాఫ్ పైన జరిగిన కాల్పుల ఘటన మరింత భయభ్రాంతులకు గురి చేసిందని క్లియర్ గా కనిపిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మరింత సెక్యూరిటీ పెంచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో కల్కి 2 చిత్రం షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతున్నారు. అలాగే పలు రకాల టాక్ షోలకు కూడా హొస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు అమితాబ్ బచ్చన్. కుమారుడు అభిషేక్ బచ్చన్ మాత్రం ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడ సినిమాలలో కనిపించడం లేదు. మరి రాబోయే రోజుల్లోనైనా పలు సినిమాలలో నటిస్తారేమో చూడాలి మరి.
బులెట్ ప్రూఫ్ గ్లాస్ రక్షణలో #AmitabhBachchan ..
అమితాబ్ ప్రతి ఆదివారం తన ఇంటి వద్ద అభిమానులను కలుస్తారు..
ఇటీవల #TigerShroff పై జరిగిన కాల్పుల ఘటన తర్వాత, బిగ్ బి కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో ఉన్నారనే ప్రచారం జరిగింది.
అందుకే అమితాబ్ ప్రస్తుతం తన సెక్యూరిటీ నిమిత్తం ప్రొటెక్టివ్ గ్లాస్ లోపల నుంచే అభిమానులను కలుస్తున్నారు.
#BishnoiGang #Bulletproof #Security
— SZN (@Suzenbabu) November 1, 2026




