NTR: గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పైన పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ RAW టీమ్ అనే పేరుతో కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ విషయం పైన కూడా కొన్ని రూమర్స్ వినిపించినప్పటికీ ఇప్పుడు తాజాగా రా సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్ తమ సంస్థ చేపట్టనున్న “ఊరు వాడ ” సేవా కార్యక్రమం పైన తాజాగా మాట్లాడారు. గత వారం రోజుల నుంచి తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు, ప్రచారాల విషయంపై కూడా స్పందించారు.
ఎన్టీఆర్ పేరుని దుర్వినియోగం చేసే ఉద్దేశం లేదు..
సాయి రూప్ మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ (NTR)పేరుని దుర్వినియోగం చేసే ఉద్దేశం తమకు లేదని, ఆయన ఆశయాలను సైతం ముందుకు తీసుకు వెళ్లడానికే ప్రయత్నం చేస్తున్నాం అని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత సేవా కార్యక్రమంలో భాగస్వామ్యులు కావడం వల్ల సమాజానికి ఉపయోగపడేలా చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని. సేవ అంటేనే కేవలం అన్నదానం, రక్తదానం మాత్రమే కాదు సమాజానికి ఉపయోగపడే ఎలాంటి మంచి పని చేసినా కూడా అది సేవ కిందికి వస్తుందని తెలియజేశారు.
also read:OTT Movie: ట్విస్టులతో ఉత్కంఠ రేపే క్రైమ్ ధ్రిల్లర్..ఒక్కొక్క సీన్ మాస్టర్ పీస్..డోంట్ మిస్..!
మన ఊరు మన బాధ్యత..
మరో అంశం మన ఊరు మన బాధ్యత అనే విషయం గురించి మాట్లాడుతూ.. గ్రామాలలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానటువంటి కొన్ని సమస్యలను గుర్తించాము. స్థానిక ప్రజల సహకారంతోనే వాటిని పరిష్కారం చూపించే ప్రయత్నం కూడా చేశామని తెలిపారు. రైతుల సమస్యల పైన ప్రత్యేకించి రైతు సదస్సులు కూడా ఏర్పాటుచేసి వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పలు రకాల కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.
also read:Varanasi:‘వారణాసి’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. ‘మందాకిని’గా ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్!
ఊరి మాట పాలకుల దాకా..
మరో అంశం ఊరి మాట పాలకుల దాకా.. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను అక్కడ ఉండే సంబంధిత ప్రజాప్రతినిధులు , అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది. ప్రజల గొంతుకను పాలకులకు వినిపించడం కూడా తమ సేవ కార్యక్రమంలో భాగమంటూ తెలియజేశారు సాయి రూప్. ఎన్టీఆర్ అభిమానులు గతంలో కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి సేవలను మరెవరు కూడా చేయలేరని తెలియజేశారు. ఇటీవల తమపైన వందల కోట్ల మోసం అభిమానుల ముసుగులో దందా వంటి ఆరోపణలు చేశారు. అవన్నీ అసత్య ప్రచారం అంటూ తెలియజేశారు.
అక్కడి నుంచే సేవ ప్రారంభం..
తాము చేసే సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ జిల్లాలలోని ఒక గ్రామం నుంచి ప్రారంభిస్తామంటూ ప్రకటించారు. ఈ కార్యక్రమం పూర్తిగా సేవా దృక్పథంతోనే కొనసాగుతుందని తెలియజేశారు సాయి రూప్. ప్రస్తుత ఎన్టీఆర్ రా సంస్థ వ్యవస్థాపకుడు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయం పైన ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.




