ప్రముఖ నటి సిరి హనుమంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. ఈమధ్య తన పాపులారిటీని మరింత పెంచుకుంది.
ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అనూహ్యంగా పాపులారిటీ పెంచేసుకున్న ఈమె.. ఇటు టీవీ షోలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. అందులో భాగంగానే కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా వచ్చిన చెన్నై లవ్ స్టోరీ సినిమాలో కూడా సిరి హనుమంత్ నటించింది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీమియర్ ఒకవైపు రన్ అవుతుంటే.. మరొకవైపు తన అందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
తాజాగా ఆరెంజ్ కలర్ చీర కట్టుకొని గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా సిరి హనుమంతు షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.