Kavya Maran:ఇప్పుడు ఎక్కడ చూసినా కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి వార్తలే వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, ప్రేమించుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఈ వార్తలపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. చూస్తుండగానే ఈ వార్తలు కాస్తా పెళ్లి వరకు వెళ్లిపోయాయి. వీరిద్దరూ త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు? :
కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ (Kavya Maran)డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, నవంబర్ 10, 11 తేదీల్లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగబోతున్నట్లు తెలుస్తోంది. గ్రీస్‌లోని అద్భుతమైన లొకేషన్‌లో ఈ రాయల్ వెడ్డింగ్ జరగబోతుందట. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత దగ్గరి సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు సమాచారం.
చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్?:
వీరి పెళ్లి పూర్తయిన తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారట. ఆ రిసెప్షన్‌కు రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు సినీ స్టార్స్‌ను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ పూర్తయిన తర్వాత ఈ రిసెప్షన్ జరగబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
నవంబర్ 21వ తేదీన చెన్నైలోని ప్రతిష్ఠాత్మక ఐటీసీ గ్రాండ్ వేదికగా ఈ రిసెప్షన్ నిర్వహించనున్నారట. అయితే, ఈ వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం.
also read:Nivetha Pethuraj:స్టేజీ పై ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టిన నివేదా పేతురాజు..!
టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్‌కు మాత్రమే ఆహ్వానం?:
గ్రీస్‌లో జరగబోతున్న వెడ్డింగ్‌కు టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క హీరోకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఆయనే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. టాలీవుడ్ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా మారిన అల్లు అర్జున్ పేరు మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానం అందుకున్న వారి జాబితాలో వినిపిస్తోంది.
also read:Nidhhi agerwal: పింక్ ఔట్ఫిట్ లో నిధి అగర్వాల్ గ్లామర్ విందు!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు:
ఒకవైపు వీరి పెళ్లి వార్తలు హల్‌చల్ చేస్తుంటే, మరోవైపు వీరిద్దరికీ సంబంధించిన కొన్ని వీడియోలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరూ ఒకే సందర్భంలో దిగిన ఫొటోలు, వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరోవైపు, ‘వీరి వెడ్డింగ్ కార్డు ఇదే’ అంటూ ఒక ఇన్విటేషన్ బాక్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి హంగామానే ఎక్కువగా కనిపిస్తోంది.
అనిరుద్, కావ్య మారన్ పెళ్లిపై అధికారిక ప్రకటన ఎప్పుడు?:
అనిరుద్ ఎంత పెద్ద టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది అందరికీ తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి పెళ్లి జరగబోతోందనే వార్తలు నిజమైతే, ఆ వేడుక ధూమ్‌ధామ్ రేంజ్‌లోనే ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ పెళ్లి వార్తలు, తేదీలు, వేదికకు సంబంధించిన వివరాలపై వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఈ వార్తలపై అనిరుద్, కావ్య మారన్ ఎప్పుడు అధికారికంగా స్పందిస్తారో చూడాలి..??




