Thursday, October 29, 2026
HomeINTERVIEWSKatrina Kaif:బాడీ షేమింగ్ ట్రోల్స్ పై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన కత్రినా కైఫ్..!

Katrina Kaif:బాడీ షేమింగ్ ట్రోల్స్ పై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన కత్రినా కైఫ్..!

Katrina Kaif: ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ తనపై వచ్చిన బాడీ షేమింగ్ ట్రోల్స్ కి తనదైన శైలిలో స్పందించి సమాధానమిచ్చింది

on
- Advertisement -banner Ad

Katrina Kaif:బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన కత్రినా కైఫ్ ఈ మధ్యకాలంలో సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. కానీ అప్పుడప్పుడు ఏదో ఒక ఫంక్షన్ లో కనిపించిన ఆమె పైన ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయాలకు గట్టి కౌంటర్ ఇస్తూనే ఉంటుంది కత్రినా కైఫ్. ఈమె భర్త విక్కీ కౌశల్ తో కలిసి అంబానీ కుటుంబం నిర్వహించిన గణేష్ వేడుకలకు హాజరయ్యారు. వివాహమై తల్లి అయిన తర్వాత చాలా నెలలకు కత్రినా కైఫ్ ఇలా బహిరంగంగా కనిపించడంతో ఆమె ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి.

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై తొలిసారి స్పందించిన కత్రినా కైఫ్.

దీంతో కొంతమంది నెటిజన్స్ ఆమె గత ఫోటోలను, ప్రస్తుతం ఉన్న ఫోటోల లుక్కుతో పోలుస్తూ ట్రోల్ చేశారు. ఈ విషయం పైన పలువురు సెలబ్రిటీలు కత్రినా కైఫ్ కి మద్దతుగా నిలిచారు. ఈ విషయం పైన ఆమె స్వయంగా తాజాగా స్పందించారు. ప్రెగ్నెన్సీ తర్వాత ఒక మహిళ ఎదుర్కొనే శరీర మార్పుల గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. అయినప్పటికీ కూడా శరీరాకృతిలో వచ్చే మార్పులను ఇలా ట్రోల్ చేయడం వారి వ్యక్తిగత నిర్ణయానికే వదిలేస్తున్నానంటూ కత్రినా కైఫ్ తెలియజేశారు. తల్లి అయిన తర్వాత వెంటనే మునుపటి శరీరాకృతికి రావాలనే ఒత్తిడి పైన కత్రినా కైఫ్ స్పందించారు.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్‌పై గందరగోళం..!

ఫిట్నెస్ జర్నీ పై కీలక వ్యాఖ్యలు..

కత్రినా కైఫ్(Katrina Kaif) మాట్లాడుతూ.. బౌన్స్ బ్యాక్ అనే పదాన్ని ప్రస్తావిస్తూ.. నా జీవితంలో ఈ అందమైన దశ పైన ముందుకు సాగాల్సిన ప్రయాణం పైనే తన దృష్టి పెట్టాలనుకున్నాను. నా మనసులో ఎప్పటినుంచో ఉన్న ఒక బలమైన కోరికనే ఇప్పుడు తన జీవితంలో ముందడుగుగా వేశానని, ఇప్పుడు మళ్లీ వెనక్కి వెళ్లాలని ఎందుకు అనుకుంటాను అంటూ కత్రినా కైఫ్ తెలియజేసింది. తన ఫిట్నెస్ జర్నీ గురించి శరీరం ఎప్పుడూ చురుగ్గా ఉంటుందనే విషయం పైన తనకి పూర్తిగా అవగాహన ఉందంటూ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Anasuya:సోషల్ మీడియాలో నెటిజన్ వింత ప్రశ్న.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

కత్రినా కైఫ్ సినిమాలు..

కత్రినా కైఫ్ 2004లో వెంకటేష్ నటించిన మల్లేశ్వరి అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత బాలయ్య నటించిన అల్లరి పిడుగు అనే సినిమాలో కూడా నటించింది. అనంతరం మళ్లీ తెలుగు సినిమాలలో కనిపించని కత్రినా కైఫ్ పూర్తిగా బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. అక్కడ కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా నటించడమే కాకుండా స్టార్ హీరోల చిత్రాలకు లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించింది. చివరిగా 2024లో విజయ్ సేతుపతి నటించిన మేరీ క్రిస్మస్ అనే చిత్రంలో కనిపించింది. మళ్లీ ఆ తర్వాత ఎలాంటి సినిమాలను అధికారికంగా ప్రకటించలేదు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సుమారుగా నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉండి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2021 డిసెంబర్ 9న రాజస్థాన్లో చాలా గ్రాండ్గా జరిగింది. ఈ దంపతులకు 2025 నవంబర్ 7న కుమారుడు జన్మించారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you