Wednesday, October 28, 2026
HomeLATESTRitika Naik :కాబోయే భర్త గురించి ఓపెన్ అయిన రితికా నాయక్..!

Ritika Naik :కాబోయే భర్త గురించి ఓపెన్ అయిన రితికా నాయక్..!

Ritika Naik: ప్రముఖ యంగ్ హీరోయిన్ రితిక నాయక్ తనకు కాబోయే భర్త లక్షణాల గురించి బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

on
- Advertisement -banner Ad

Ritika Naik :టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్లలో యంగ్ హీరోయిన్ రితికా నాయక్ కూడా ఒకరు. అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత నానితో కలిసి హాయ్ నాన్న చిత్రంలో నటించింది. ఆ తర్వాత తేజ సజ్జా తో నటించిన మిరాయ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లోకి చేరింది. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది.

పెళ్లి పై రితికా కామెంట్స్..

ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. వరుస క్రేజీ ప్రాజెక్టులు అందుకున్న రితిక.. ప్రస్తుతం సందీప్ కిషన్ నటిస్తున్న పవర్ పేట అనే ఒక చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో ఒక సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత రితికా నాయక్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉండగా అక్టోబర్ 27న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి సమయంలోనే రితికా కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెరమీదకి వచ్చాయి.

- Advertisement -
Advertisement

also read:Ramayana:రామాయణ ఫస్ట్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

ఆయనంటే చాలా ఇష్టం..

నాకు అందమైన రూపం ఉందని, బాగా నటిస్తుందని ప్రేక్షకులు అనుకోవాలన్నదే నా లక్ష్యము. అన్ని రకాల పాత్రలలో నటించాలనే కోరిక కూడా ఉన్నది. ఒక్క తరహా పాత్రలకే పరిమితం కావడం నాకు ఇష్టం లేదు అంటూ తెలియజేసింది రితికా(Ritika Naik ). అలాగే మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా తనకు అల్లు అర్జున్ పైన క్రష్ ఉందని తన మనసులో మాట తెలియజేసింది. అలాగే ఇక జీవితం భాగస్వామి విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయంటూ తెలియజేసింది ఈ ముద్దు గుమ్మ.

- Advertisement -
Advertisement

also read:Rajasekhar:నా కెరీర్ డౌన్‌ఫాల్‌కు కారణం అదే.. రాజశేఖర్ బయటపెట్టిన పచ్చి నిజాలు..!

కాబోయే భర్తకి అలాంటి లక్షణాలు ఉండాలి..

తనకి కాబోయే వారు తనని ఎంతో ప్రేమించే వ్యక్తి అయి ఉండాలని అలాగే బంధంలో నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ..నా వృత్తిని అర్థం చేసుకుంటూ కెరియర్లో ముందుకు ప్రోత్సహించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి నాకు భర్తగా రావాలని కోరుకుంటున్నానని రితికా నాయక్ తెలిపారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవర్ పేట సినిమాకి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయగా సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ హాట్ గ్లామర్ బ్యూటీగా కనిపిస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా ఇందులో తన పాత్ర ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ రితికా నాయక్ తన కాబోయే భర్త గురించి పలు విషయాలు బయటపెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you