Wednesday, November 25, 2026
HomeLATESTMahesh Babu:మహేష్ బాబుని మెప్పించిన చిన్నారి.. వీడియో వైరల్..!

Mahesh Babu:మహేష్ బాబుని మెప్పించిన చిన్నారి.. వీడియో వైరల్..!

Mahesh Babu: మహేష్ బాబు ని ఒక చిన్నారి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో పాటలతో మెప్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Mahesh Babu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో క్లాసికల్ సినిమాలు , బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు కెరియర్ లో పోకిరి సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా పోకిరి, గుంటూరు కారం సినిమాలోని పాటలు పాడుతూ ఒక అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి మహేష్ బాబు కూడా ఫిదా అయ్యారు.

మహేష్ బాబును మెప్పించిన చిన్నారి..

ఆ అమ్మాయి క్యూట్ నెస్ కి కూడా మహేష్ బాబు కామెంట్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆ వీడియో దూసుకుపోతోంది. ఏకంగా 27 మిలియన్ల వ్యూస్ తో ట్రెండీగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. bysweetlycurious అనే instagram రీల్ నేటిజెన్లను అమితంగా ఆకట్టుకుంది. ఇందులో ఒక చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి క్యూట్గా పాటలు పాడుతూ కనిపించింది. మొదట పోకిరి చిత్రంలోని నొప్పి గుండెంత నొప్పి అనే పాటను పాడిన చిన్నారి.. ఆ తర్వాత తన అమ్మతో కలిసి గుంటూరు కారం సినిమాలోని ధూమ్ మసాలా పాటను పాడింది.

- Advertisement -
Advertisement

also read:Mahesh Babu:సాదాసీదాగా మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి.. ఫోటోలు వైరల్!

మహేష్ బాబు రిప్లై వైరల్..

ఇందులో ఆ చిన్నారి పాడిన స్వీట్ వాయిస్ తో పాటు ఆ పాప ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అభిమానులను , నెటిజన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా మహేష్ బాబు కూడా చిన్నారు వీడియోని చూసి వెంటనే తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి.. “హ హ.. సో క్యూట్.. లాట్స్ ఆఫ్ లవ్ టు ది లిటిల్ వన్ ” అంటూ కామెంట్ చేశారు. దీంతో ఏకంగా ఈ రీల్ 27 మిలియన్లు వ్యూస్ కి దూసుకుపోయింది. అంతేకాకుండా అకౌంట్ ఫాలోవర్స్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయారు.

- Advertisement -
Advertisement

also read:Bollywood Ramayana:ఆస్కార్ రేసులో బాలీవుడ్ రామాయణ..!

మహేష్ బాబు పోస్ట్ .. ఐదు రెట్లు పెరిగిన ఫాలోవర్స్..

ఈ రీల్ రాకముందు 35K ఫాలోవర్స్ ఉండగా ఈ రీల్ తో ఇప్పుడు ఏకంగా 151k ఫాలోవర్స్ వచ్చేశారు. మొత్తానికి మహేష్ బాబు కామెంట్ తో ఈ చిన్నారి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండీగా మారింది.. మహేష్ బాబు(Mahesh Babu) సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో వారణాసి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ చిత్రం గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ఫాన్ వరల్డ్ మూవీగా వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడవ తేదీన రాబోతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్లు కూడా చిత్ర బృందం విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you