Wednesday, November 25, 2026
HomeLATESTPoonam Kaur:త్రివిక్రమ్ పై పూనమ్ మరో షాకింగ్ పోస్ట్.. ఆ హీరోయిన్ కి సపోర్ట్ చేస్తూ..!

Poonam Kaur:త్రివిక్రమ్ పై పూనమ్ మరో షాకింగ్ పోస్ట్.. ఆ హీరోయిన్ కి సపోర్ట్ చేస్తూ..!

Poonam Kaur: ప్రముఖ నటి పూనం కౌర్ ఇటీవల పూజిత పొన్నాడ చేసిన కామెంట్లకు త్రివిక్రమ్ పై మండిపడుతూ పోస్ట్ పెట్టింది.

on
- Advertisement -banner Ad

Poonam Kaur:ఏ భాషలోనైనా సరే సినిమాలలో పాత్రల మార్పులు, హీరోయిన్స్ రీప్లేస్మెంట్ వంటివి జరుగుతూ ఉండడం కొత్తమే కాదు.. కొన్ని సందర్భాలలో కనీసం సమాచారం లేకుండా పక్కన పెట్టేయడం కూడా చాలామంది సెలబ్రిటీలకు బాధ కలిగిస్తూ ఉంటుంది. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమా విషయంలో కూడా తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ప్రముఖ తెలుగు నటి పూజిత పొన్నాడ తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలను బయటపెట్టింది.

నమ్మించి మోసం చేశారు..

పూజిత పొన్నాడ మాట్లాడుతూ..” సాధారణంగా ఏ నటికైనా సినిమాలో ఫుల్ లెన్త్ పాత్ర దొరకడం తన కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది.. అలా ఆదర్శ కుటుంబం మేకర్స్ కూడా సరిగ్గా ఇదే మాట చెప్పి నన్ను సంప్రదించారు. సినిమాలో నాది చాలా ముఖ్యమైన పాత్ర అని, పూర్తిస్థాయి నిడివి ఉండే పాత్ర అని చెప్పడంతో చాలా ఆనందపడ్డాను. ఆ ప్రాజెక్టు కూడా ఓకే చెప్పాను.. అనుకున్నట్టుగానే ఫస్ట్ షెడ్యూల్ మొదలయ్యింది. సెట్లోకి అడుగుపెట్టి దాదాపుగా ఐదు రోజులపాటు నా పాత్రకు సంబంధించిన షూటింగ్లో కూడా పాల్గొన్నానని” వెల్లడించింది.

- Advertisement -
Advertisement

also read:Mahesh Babu:మహేష్ బాబుని మెప్పించిన చిన్నారి.. వీడియో వైరల్..!

నా స్థానంలో మరొక నటిని చూసి షాక్ అయ్యాను..

అనంతరం ఆమె మాట్లాడుతూ..” ఈ ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన తర్వాత రెండో షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందా అని చాలా ఎదురు చూశాను. అలా వారాలు, నెలలు గడిచినా కూడా మేకర్స్ నుంచి నాకు ఎటువంటి స్పందన రాలేదు.. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందనుకున్నాను . కానీ సరిగ్గా మూడు నెలల తర్వాత అసలు నిజం బయటపడింది.. నా స్థానంలో మరొక నటిని తీసుకున్నారని తెలిసి షాక్ అయ్యానని వెల్లడించింది. కథలో మార్పుల వలన ఇతర కారణాల వల్ల నటీనటులను మార్చాల్సి వస్తే ముందుగా ఆ విషయాన్ని ఆ ఆర్టిస్ట్ కి తెలియజేయడం సినీ ఇండస్ట్రీలో సాంప్రదాయం కానీ అలాంటిది ఈ సినిమా విషయంలో జరగలేదు అంటూ తెలిపింది. సైలెంట్ గా వేరే హీరోయిన్ ను పెట్టేశారు . మూడు నెలల పాటు ఆ సినిమా పైన ఆశలు పెట్టుకున్నాను. కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం చాలా బాధగా అనిపించిందంటూ ఎమోషనల్ గా మాట్లాడింది పూజిత పొన్నాడ.

- Advertisement -
Advertisement

also read:Mahesh Babu:సాదాసీదాగా మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి.. ఫోటోలు వైరల్!

పూజిత కి సపోర్ట్ గా పూనమ్..

ఈ విషయం పైన మరో హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur)స్పందిస్తూ.. ఈ యంగ్ టాలెంటెడ్ నటికి గ్రేట్ ఫ్యూచర్ ఉండాలని ,ఆ దేవుడిని కోరుకుంటున్నానని.. అలాగే మంచి విజయాలను అందించాలని.. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ పూనమ్ కౌర్ చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి ఈ విషయం పైన నటి పూజిత పొన్నాడ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. గతంలో కూడా ఎన్నో సందర్భాలలో త్రివిక్రమ్ విషయం పైన పూనమ్ కౌర్ స్పందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. మరి ఈ విషయం పైన ఎవరు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you