Mahesh Babu:సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో కొత్త హీరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. మహేష్ బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంతో జయకృష్ణ సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
రషా తడానీ టాలీవుడ్ అరంగేట్రం:
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ (RASHA THADANI)కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. కొత్త జంటగా వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది. దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను రూపొందించగా, అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
మహేష్ బాబు ప్రత్యేక వీడియో సందేశం:
సినిమా విడుదలకు ముందు మహేష్ బాబు ప్రత్యేక వీడియో ద్వారా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ఎంతో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. సినిమా ఎంతో బాగుంటుందనే నమ్మకం తనకు కలిగిందని చెప్పారు. ఈ విజయానికి దర్శకుడు అజయ్ భూపతి కృషి కీలకమని ప్రశంసించారు.
ALSO READ:OTT:ఓటీటీలో ట్రెండింగ్‌లో ‘పురుష:’.. దూసుకెళ్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..!
‘రాజకుమారుడు’ జ్ఞాపకాన్ని గుర్తు చేసిన మహేష్
జూలై 30 తేదీ తనకు ప్రత్యేకమైన రోజని మహేష్ బాబు పేర్కొన్నారు. అదే రోజున తన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ కూడా విడుదలై విజయాన్ని అందుకుందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే తేదీన జయకృష్ణ(Jayakrishna Ghattamaneni) తొలి చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమా కూడా ఘన విజయాన్ని సాధించి జయకృష్ణకు మంచి భవిష్యత్తు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ALSO READ:TV:ప్రేమ వార్తలకు మరోసారి ఊపిరి పోసిన నవ్య-రవికృష్ణ.. వైరల్ అవుతున్న ప్రోమో!
వైరల్‌గా మారిన వీడియో:
మహేష్ బాబు(Mahesh Babu) విడుదల చేసిన శుభాకాంక్షల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వస్తుండటంతో అభిమానులు కూడా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ జయకృష్ణ తొలి అడుగు ఎంత విజయవంతమవుతుందో తెలుసుకోవాలంటే జూలై 30 వరకు వేచి చూడాల్సిందే.
Extremely happy for #JaiKrishnaGhattamaneni and #RashaThadani on their debut with #SrinivasaMangapuram…. I wish the whole team the very best for July 30th!!! 🤗🤗🤗♥️♥️♥️@DirAjayBhupathi #RashaThadani @themohanbabu @AshwiniDuttCh @gvprakash @gemini_kiran @CKPicturesoffl pic.twitter.com/VPgSDQRmAn
— Mahesh Babu (@urstrulyMahesh) July 26, 2026




