Mammootty:ఎట్టకేలకు 2024వ సంవత్సరానికి గానూ.. కేంద్ర ప్రభుత్వం జూలై 18వ తేదీన పలువురు ప్రముఖుల సమక్షంలో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఉత్తమ నటుడు విభాగంలో కార్తిక్ ఆర్యన్ తో పాటు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి చోటు దక్కించుకోవడం ప్రశంసనీయం. అయితే ఇప్పటికే పద్మభూషణ్ అవార్డుతో గౌరవాన్ని అందుకున్న మమ్ముట్టి.. ఇప్పుడు తన కెరీర్లో నాలుగవ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకొని మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. చందు ఛాంపియన్ చిత్రానికి గానూ ఎంపికైన బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తో కలిసి భ్రమయుగం చిత్రంలో అసాధారణ నటన కనబరిచి, ఉత్తమ నటుడిగా ఎంపికైన మమ్ముట్టి ఈ అవార్డును పంచుకున్నారు. ఈ విజయంతో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ ను సమం చేసిన మమ్ముట్టి..
ఐదు దశాబ్దాల సినీ పరిశ్రమలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న మమ్ముట్టి (Mammootty).. ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారు. ఈసారి నాలుగవ జాతీయ అవార్డుతో మమ్ముట్టి మరో ఉన్నత శిఖరానికి చేరుకోవడమే కాకుండా అత్యధిక జాతీయ ఉత్తమ నటుడి అవార్డులు అందుకున్న నటుల జాబితాలో అమితాబ్ బచ్చన్ సరసన నాలుగు విజయాలతో సమానంగా నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇకపోతే మమ్ముట్టి నేషనల్ అవార్డుల ప్రయాణం కూడా చాలా గొప్పది. 1990లో వచ్చిన ఒరు వడక్క వీర గాథ, ముథిలుకల్ చిత్రాలకు, 1994లో విధేయన్, పొంతన్ మాడ, 1999లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు నాలుగవసారి భ్రమయుగం సినిమాతో ఈ గౌరవాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.
also read:Nani:భారీ ధరకు నాని ది ప్యారడైజ్ నైజాం రైట్స్!
5 దశాబ్దాల కెరియర్ లో ఎన్నో అవార్డులు..
నాలుగవసారి ఈ జాతీయ అవార్డు లభించడంతోపాటు ఇప్పటికే తన కెరీర్లో 11 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులు, 11 కేరళ సినీ విమర్శకుల పురస్కారాలు అందుకున్నారు. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా తన ప్రత్యేకమైన నటనతో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక నటుడు మాత్రమే కాదు నిర్మాతగా కూడా సక్సెస్ఫుల్గా తన కెరీర్ను కొనసాగిస్తున్నారు మమ్ముట్టి. ఇక మమ్ముట్టి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకోవడంతో పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
also read:72nd National Film awards: ఉత్తమ నటుడు ఎవరంటే?.. లిస్ట్ ఇదే..!
మమ్ముట్టి కి కమలహాసన్ అభినందనలు..
నేషనల్ అవార్డు రావడం పై కమలహాసన్ స్పందిస్తూ.. “ఒకప్పుడు నేషనల్ అవార్డుల సంఖ్యలో నన్ను అధిగమిస్తానని మమ్ముట్టి చెప్పారు . ఎప్పటిలాగే నువ్వు మాట నిలబెట్టుకున్నావ్. ఇంకా మరెన్నో పురస్కారాలు అందుకోవాలి మిత్రమా” అంటూ హృదయపూర్వకంగా అభినందించారు. ఇకపోతే ఇప్పటివరకు కమలహాసన్, మమ్ముట్టి చెరో మూడు నేషనల్ అవార్డులతో సమంగా నిలవగా ..ఇప్పుడు మమ్ముట్టి నాలుగో నేషనల్ అవార్డుతో ముందంజలో నిలిచారు.
మమ్ముట్టి పై సెలబ్రిటీలు ప్రశంసలు..
మోహన్ లాల్ కూడా శుభాకాంక్షలు చెబుతూ..” ఇది మన అందరికీ గర్వకారణమైన క్షణం ..పూర్తిగా అర్హతతో వచ్చిన గుర్తింపు ” అంటూ తన చిరకాల మిత్రుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక అలాగే టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈయన తదుపరి చిత్రాల విషయానికొస్తే అడూర్ గోపాలకృష్ణతో పాదయాత్ర చిత్రంలో మళ్లీ నటిస్తున్నారు. అలాగే ధనుష్ తో కలసి ఓం అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.




