Sunday, November 8, 2026
HomeLATESTRanbir Kapoor:సినిమాలకి గుడ్ బై చెప్పనున్న రణబీర్ కపూర్.. కారణం..?

Ranbir Kapoor:సినిమాలకి గుడ్ బై చెప్పనున్న రణబీర్ కపూర్.. కారణం..?

Ranbir Kapoor: ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను సినిమాలకు నటనకు గుడ్ బై చెప్పబోతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు.

on
- Advertisement -banner Ad

Ranbir Kapoor:బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన వారిలో రణబీర్ కపూర్ కూడా ఒకరు. ఇటీవల విజువల్ వండర్ గా విడుదలైన రామాయణ మొదటి భాగంలో నటించారు. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా రెస్పాన్స్ లభించింది. డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళి కానుకగా నవంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా అటు సినీ ప్రేక్షకులను అభిమానులను బాగా ఆకట్టుకుంది. విడుదలైన రెండు రోజులలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

అద్భుతమైన నటనతో రామాయణలో ఆకట్టుకున్న రణబీర్..

రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. రాముడి పాత్రలో రణబీర్ చాలా హుందాతనంగా నటించారు.ఎక్కడ పేరు పెట్టడానికి వీలు లేకుండా పరిపూర్ణ న్యాయం చేశారని కూడా పలువురు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా అరణ్యవాసంలో రాక్షసులతో సాగే యుద్ధ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చూసిన ప్రేక్షకులు థియేటర్లలో సరికొత్త అనుభూతి కలిగించిందని పంచుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు , సెలబ్రిటీలు కూడా సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు.

- Advertisement -
Advertisement

also read:Jabardasth Priyanka Singh:కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ ప్రియాంక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

నటనకు గుడ్ బై..

ఒకవైపు రామాయణ సినిమాతో కెరీర్లో అతిపెద్ద విజయాన్ని అందుకున్న రణబీర్ కపూర్(Ranbir Kapoor).. భవిష్యత్తు ప్రణాళిక పైన చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అభిమానులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నటుడుగా ఇది తనకు చివరి దశాబ్దమని, త్వరలోనే తాను అన్ని ఆపేసి దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్ సినిమా నిర్మాణం, రచన, దర్శకత్వం పై తనకున్న ఇష్టాన్ని తెలియజేశారు. ఇప్పటికే రెండు నెలల క్రితం ఒక కథను రాయడం మొదలు పెట్టానని, అయితే కొత్త కథను సృష్టించడం చాలా కష్టం.. రచయిత శ్రమను చూస్తే అది మనకి అర్థమవుతుంది, సినిమా నిర్మాణ ప్రక్రియలు, సంగీత దర్శకుడు తర్వాతే కథను తెరపైకి తీసుకువచ్చే వారిలో దర్శకుడు అసలైన సంతృప్తి పొందుతారని తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Prabhas:రామాయణంలో రావణుడిగా ప్రభాస్.. చివరి నిమిషంలో ఏమైంది?

కొత్త ప్రాజెక్టుపై క్లారిటీ..

వందలాది మందిని ఏకం చేసి ఒకే కథను ప్రపంచానికి చూపించే అవకాశం.. ఒక అద్భుతమైన అనుభవమని తెలిపారు. తనకు ఆ బాధ్యతలో కచ్చితంగా సక్సెస్ అవ్వగలనే నమ్మకం ఉందంటూ తెలియజేశారు. తాను తీయబోయే సినిమాను ప్రస్తావిస్తూ.. తాను ఫీల్ గుడ్ డ్రామా కథలను తెరకెక్కించడానికి ఇష్టపడతానని తెలిపారు. ప్రస్తుతం తన చేతిలో బ్రహ్మాస్త్ర 2, యానిమల్ 2, రామాయణం 2 వంటి చిత్రాలు ఉన్నాయని, ఇవి పూర్తి చేసిన తర్వాత దర్శకత్వ బాధ్యతలోకి దిగుతానంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ తాను దర్శకత్వం చేసే సినిమాలలో మాత్రం నటించనని, పూర్తిగా తెరవెనుకే ఉండి కథను నడిపించాలనుకుంటున్నాను అంటూ తెలియజేశారు. ఏడాదికి 100 నుంచి 125 రోజులు మాత్రమే సినిమా షూటింగ్లలో పాల్గొనే అలవాటు ఉండటం వల్ల తనకు స్క్రిప్ట్ వర్క్ చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని తెలియజేశారు. మరి త్వరలోనే దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్న రణబీర్ కి అభిమానులు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you