Ramayana:డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ చిత్రం రామాయణం. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవి పాత్రలో సాయి పల్లవి, యశ్ రావణాసుడిగా నటించారు. శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీతిసింగ్ నటించింది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి అప్డేట్ కూడా రామాయణం సినిమా అంచనాలను పెంచేసింది. సుమారుగా 4వేల కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు.
లాస్ ఏంజిల్స్ లో రామాయణ మొదటి భాగం రిలీజ్..
తాజాగా రామాయణం(Ramayana) సినిమా ఇంగ్లీష్ వర్షన్ ప్రీమియర్ షో లను లాస్ ఏంజీల్స్ లో ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇందులో హాలీవుడ్ సినీ ప్రముఖులు , సినీ విశ్లేషకులు ప్రీమియర్ షో చూసి పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆంక్షలు విధించినప్పటికీ ఒకరిద్దరి సమీక్షలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. ఒక హాలీవుడ్ క్రిటిక్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. 2001లో ది లార్డ్ ఆఫ్ రింగ్స్ సినిమాను చూశాను . అప్పటినుంచి ఈ సినిమా చూశాకే మరొకసారి అలాంటి అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించానని తెలియజేశారు.
also read:Rajasekhar:నా కెరీర్ డౌన్ఫాల్కు కారణం అదే.. రాజశేఖర్ బయటపెట్టిన పచ్చి నిజాలు..!
ఫస్ట్ రివ్యూ బయటపెట్టిన క్రిటిక్..
సినిమా ప్రపంచంలో తాను ఇప్పుడే చూసిన ఇలాంటి సినిమా మరొకటి లేదని , ఈ సినిమా అరేబియన్ సైట్స్ తరహాలో ఒక అద్భుతమైన కథ నిజరూపం దాల్చినట్టుగా ఉన్నదంటూ తన అభిప్రాయంగా పంచుకున్నారు ఆ క్రిటిక్. అయితే ఒకరిద్దరి అభిప్రాయాలను ప్రేక్షకులు అభిప్రాయంగా భావించలేనప్పటికీ రామాయణ మొదటి భాగం పైన ఈ క్రిటిక్ పాజిటివ్ టాక్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవంబర్ ఐదు న రామాయణ మొదటి భాగం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఆరోజు అసలైన టాక్ బయటికి వస్తుందని పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
I’m seated and ready to watch Ramayana at the film’s world premiere tonight
#Ramayana #RamayanaMovie #RamayanaOnNov5th #worldpremiere #IMAX #leaks https://t.co/WpuyveAreL
— 𝓢𝓱𝓸𝓸𝓫𝓱𝓪𝓶 (@sh_oobham) October 28, 2026
also read:Pooja Hegde:పూజా హెగ్డే కోసం అల్లు అర్జున్ సర్ప్రైజ్ కాల్.. వైరల్ అవుతున్న వీడియో!
నవంబర్ ఐదు న అసలు టాక్..
డైరెక్టర్ నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్ర అక్టోబర్ 28న బుధవారం ఉదయం ఏడు గంటలకు లాస్ ఏంజెల్ లో ప్రదర్శించిన రామాయణం గ్రాండ్ ప్రీమియర్ షో కి హాజరయ్యారు. సుమారుగా పలు రకాల భాషలలో రామాయణం సినిమాని విడుదల చేయబోతున్నారు. సోషల్ మీడియాలో రామాయణం సినిమా గురించి ఏదో ఒక విషయం రోజు వైరల్ గా మారుతూనే ఉంది. ఇటీవలే రావణాసురుడుగా నటించిన యశ్ పాత్రకి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో లీక్ అయినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. ఆ వీడియో చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రామాయణం సినిమా విడుదలైన తరువాత ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి. బాలీవుడ్ లోనే భారీ బడ్జెట్ సినిమా గా పేరు సంపాదించింది. మరి ఈ సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి మరి.
First reaction on Ramayana is out 💥
#Ramayana https://t.co/4d6gBOd5ws
— Lucif3r. (@Luci_twtz) October 28, 2026




