Friday, November 6, 2026
HomeLATESTRamayana:రామాయణ సినిమా మొదటిరోజు కలెక్షన్స్..?

Ramayana:రామాయణ సినిమా మొదటిరోజు కలెక్షన్స్..?

Ramayana: నాలుగు వేల కోట్ల బడ్జెట్తో భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు నవంబర్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన రామాయణ సినిమా మొదటిరోజు కలెక్షన్లు వైరల్ గా మారాయి.

on
- Advertisement -banner Ad

Ramayana:భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన మైథాలాజికల్ మూవీ రామాయణ. భారీ అంచనాల మధ్య నవంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ కూడా రాబడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందీ వర్షన్ తో పాటు దక్షిణాది భాషలలో కూడా ఈ సినిమా కలెక్షన్స్ భారీగానే సాధించడం గమనార్హం. ముఖ్యంగా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

రామాయణ సినిమా మొదటిరోజు కలెక్షన్స్..

విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 118 కోట్లకు పైగా వసూలు సాధించినట్లు వినిపించాయి.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి ఆదరణ భారీగా రావడంతో మొదటి రోజు కలెక్షన్స్ భారీ స్థాయిలో నమోదైనట్టుగా సమాచారం. తొలిరోజే ఇండియాలో సుమారుగా రూ. 77 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది.. భాషలవారీగా వసూళ్లని చూస్తే.. హిందీలో 47 కోట్లు, తెలుగులో 6 కోట్లు, కన్నడలో ఏడు కోట్లు గ్రాస్ సాధించాయి. ఉత్తరాది ప్రేక్షకుల నుంచి రామాయణ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Sai Dharam Tej :నిశ్చితార్థం చేసుకున్న మెగా హీరో.. ఫొటోస్ వైరల్..!

భాగమైన భారీ తారాగణం..

రామాయణ(Ramayana)మాలో రణబీర్ కపూర్ రాముడిగా, సీతాదేవి పాత్రలో సాయి పల్లవి ,రావణాసురుడిగా యశ్ అద్భుతంగా నటించారు. సూర్పనఖ పాత్రలో రకుల్ ప్రీతిసింగ్, లక్ష్మణుడిగా రవి దుబే, సన్నీడియోల్ హనుమంతుడిగా కనిపించారు. 4 వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్, అద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందించడంతో ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలోని విజువల్స్ , కొన్ని తెలియని విషయాలను కూడా చూపించడంతో సినిమా చూడడానికి చాలా మంది మక్కువ చూపుతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Mahashakthi Movie Review:నయనతార మహాశక్తి మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా?

ఆ సినిమా కలెక్షన్స్ ను దాటలేకపోయిన రామాయణ..

రామాయణ సినిమా ఓపెనింగ్స్ తోనే పలు భారీ చిత్రాల తొలి రోజు కలెక్షన్స్ వెనక్కి నెట్టింది.. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాల తొలి రోజు కలెక్షన్స్ ని అధిగమించింది. కానీ ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా కలెక్షన్స్ ని మొదటి రోజు అన్ని భాషలలో రూ. 86.75 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది. రామాయణ సినిమా మాత్రం తొలిరోజు వసూళ్ల విషయంలో ఈ సినిమాను అధికమించలేకపోయింది. కానీ రామాయణ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ స్పందన రావడంతో రాబోయే రోజుల్లో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది. అంతేకాకుండా దీపావళి సెలవులు కూడా రామాయణ సినిమాకి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..అలాగే రామాయణ పార్ట్ 2 వచ్చే యేడాది విడుదల అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సినిమాకు సంబంధించి సగం వరకు షూటింగ్ అయ్యిందని , మిగిలిన భాగం ఉందని తెలియజేశారు..అలాగే పార్ట్ 3 కూడా ఉంటుందని డైరెక్టర్ నితీష్ తివారి తెలియజేశారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you