Thursday, November 5, 2026
HomeLATESTnarne Nitin:ఎన్టీఆర్ బావమర్ది నితిన్ నార్నేకు సర్జరీ.. ఏం జరిగిందంటే..?

narne Nitin:ఎన్టీఆర్ బావమర్ది నితిన్ నార్నేకు సర్జరీ.. ఏం జరిగిందంటే..?

Narne Nitin: ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ కి సర్జరీ జరిగింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు మండిపడుతున్నారు.

on
- Advertisement -banner Ad

narne Nitin:తెలుగు సినీ పరిశ్రమలో యువ నటుడుగా పేరు సంపాదించిన నితిన్ నార్నే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2023లో మ్యాడ్, 2025 లో మ్యాడ్ స్క్వేర్ , ఆయ్ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించారు. ఆ తర్వాత శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు నితిన్ నార్నే. తాజాగా ఈ నటుడికి బుధవారం రోజున ఒక గాయమైందని ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్లో కుడి భుజానికి గాయమైనట్లుగా వినిపిస్తోంది.

ఎన్టీఆర్ బావమరిదికి సర్జరీ..

నితిన్ నార్నేకి గాయం అవ్వడంతో కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు..అక్కడ తక్షణమే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలియజేయడంతో ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ ఆర్ ఏ పూర్ణచంద్ర ఆధ్వర్యంలో నితిన్ నార్నే భుజం సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ గాయమైనట్లుగా సమాచారం. ఆపరేషన్ సక్సెస్ కావడంతో అటు అభిమానులతో పాటు చిత్ర బృందం కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం నితిన్ నార్నే ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -
Advertisement

also read:Medha Meka:శ్రీకాంత్ కూతురికి బంపరాఫర్!

విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సలహా..

అయితే కొద్ది రోజులపాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలియజేశారట. కుటుంబ సభ్యులు గోప్యత కల్పించాలని ఎటువంటి వదంతులు కూడా నమ్మవద్దనీ, ఎవరు కూడా హాస్పిటల్ దగ్గరికి రావద్దు అంటూ కిమ్స్ ఆస్పత్రి వర్గాలు కోరాయి. ఇటీవల కాలంలో చాలామంది హీరోలు సినిమా షూటింగ్లో గాయపడడం జరిగింది. దాదా సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ కు గాయం అవ్వగా.. పెద్ది సినిమా షూటింగ్ సెట్ లో రామ్ చరణ్ కూడా గాయం అయింది, అలాగే ఎన్టీఆర్ నటించిన డ్రాగన్ సినిమా షూటింగ్ సమయంలో కూడా భుజానికి గాయమై శస్త్ర చికిత్స కూడా చేశారు. ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ కోలుకుంటున్నారు. తిరిగి త్వరలోనే సినిమా షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Payal Raj put:రాధిక ఆప్టేకు.. దిమ్మతిరిగే కౌంటర్ వేసిన పాయల్ రాజ్ పుత్..!

రూమర్ల పై మండిపడ్డ ఫ్యామిలీ..

నితిన్ నార్నే(narne Nitin) ఆస్పత్రి పాలయ్యారు అనే వార్తలు సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వైరల్ గా మారుతున్నాయని.. ఈ విషయం పైన కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా స్పందించారు.. నితిన్ ఆరోగ్యం పైన వస్తున్న వదంతులు కేవలం కట్టుకథలు అని నితిన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఎవరు ఎలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చేయకండి అంటూ వైద్యులు సైతం కోరుకుంటున్నారు. ప్రస్తుతం నితిన్ నార్నే కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నారు. జూనియర్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఇందులో మేఘ శెట్టి, అనిఖ సురేంద్రన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నితిన్ నార్నే విషయంపై వస్తున్న వదంతులకు జూనియర్ ఎన్టీఆర్ గానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you