Sai Dharam Tej:గత కొద్ది రోజులుగా మెగా కుటుంబంలో శుభకార్యం జరగబోతోందని, ముఖ్యంగా టాలీవుడ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ ఎంగేజ్మెంట్ జరుగుతోందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు నిజంగానే నవంబర్ 5వ తేదీన హైదరాబాదులో ఇరువురు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక చాలా గ్రాండ్గా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నిశ్చితార్థం చేసుకున్న మెగా హీరో..
సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నిశ్చితార్థ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు సైతం హాజరైనట్లుగా తెలుస్తోంది. సాంప్రదాయమైన దుస్తులలో ఈ వేడుక చాలా ఘనంగా జరిగినట్లుగా కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. చాలాకాలం తర్వాత మెగా కుటుంబంలో పెళ్లి వేడుక జరగడంతో అభిమానులకు కూడా మరింత ఉత్సాహం కనిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్ వివాహం చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయం గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ఈమె సాయి ధరంతేజ్ చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయి తోనే ఈ వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది.
also read:Mahashakthi Movie Review:నయనతార మహాశక్తి మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా?
డిసెంబర్ 10న వివాహం..
ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత డిసెంబర్ లోనే వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 10వ తేదీన తేజ్, కిరణ్మయి వివాహం ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వివాహ వేదిక, పెళ్లి తేది గురించి ఇప్పటివరకు అధికారికంగా మెగా కుటుంబ సభ్యులు కానీ తేజ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. తమ అభిమాన హీరో త్వరలోనే ఒక ఇంటి వారు కాబోతున్నారనే వార్తతో తేజ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
also read:Scene Movie:సీన్ మూవీ రివ్యూ: సూర్య ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?
సాయి ధరంతేజ్ సినిమాలు..
సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పైన కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రోహిత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.హీరోయిన్గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. అలాగే జగపతిబాబు ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. చివరిగా తేజ్ 2023లో బ్రో సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్లకి సంబరాలు ఏటిగట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా తన కెరీర్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి మరి. గతంలో కూడా సాయి ధరంతేజ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని రూమర్స్ కూడా వినిపించాయి .కానీ ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెడుతూ కిరణ్మయి తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం గమనార్హం. మెగా అభిమానులు మాత్రం ఈమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.
Sai Durga Tej got engaged today!
Congrats 🥳 https://t.co/eyUwsZJYZg
— idlebrain jeevi (@idlebrainjeevi) November 5, 2026




