Tollywood:తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు ఆశిష్ విద్యార్థి. అయితే తెలుగు చిత్రాలలోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం వల్ల కూడా నిరంతరం ఎప్పుడు వార్తలలో నిలుస్తూనే ఉంటారు. ఇటీవల 60 ఏళ్ల వయసులో రూపాలిను పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం అటు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు.
55 ఏళ్ల వయసులో మొదటి భార్యతో విడాకులు..
తాజాగా తన మొదటి వివాహం , విడాకులతో పాటుగా రెండో పెళ్లి గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితితోపాటు ఆ బాధ నుంచి తాను ఎలా బయటపడ్డాడో వివరించారు. మొదటి వివాహం నటి, గాయని రాజోషితో జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు . దాదాపుగా 24 ఏళ్ల తర్వాత ఈ జంట విడిపోవడం జరిగింది. అలా చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్న నటుడు ఆశిష్ విద్యార్థి 2023లో రెండవ వివాహం చేసుకున్నారు. 24 సంవత్సరాల తర్వాత తన మొదటి భార్యతో విడాకుల విషయంపై చాలా కష్టంగా అనిపించిందని , అప్పటికే నా వయసు 55 సంవత్సరాలు అని తెలిపారు.
also read:Keerthy Suresh:15 ఏళ్ల ప్రేమకథలో అసలు ట్విస్ట్.. కీర్తి సురేష్ డైరీలో ఏముంది?
రెండో పెళ్లిపై ప్రజల అభిప్రాయాన్ని పంచుకున్న నటుడు..
విడాకులు తీసుకున్న తర్వాత అంతా అయిపోయిందని , కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల నా బంధం ముగిసింది. దాని గురించి మాట్లాడటం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదు అంటూ చెప్పుకొచ్చారు. నేను ఒక నటుడుని.. నా గురించి ప్రజలు ఏమనుకున్నారో.. నేను దానిని ఎలా ఎదుర్కొన్నానో నాకు మాత్రమే తెలుసు.. ప్రజలు నిరసన తెలిపినప్పుడు వారికి పరిస్థితి అర్థం కాలేదు. అయినా కూడా వారు ఆత్మవిశ్వాసంతోనే మాట్లాడారు. ఇలాంటివి జరిగినప్పుడు ఒక వ్యక్తి కాదు అందరూ కూడా మాట్లాడుతారు.. ముఖ్యంగా ప్రజలు నాతో ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సహజీవనం ఎందుకు చేయకూడదు? అని చెప్పేవారే చాలామంది ఉన్నారని తెలిపారు. కొంతమంది నా కెరియర్ ముగిసిపోయిందని, తాను నిశ్శబ్దంగా కూర్చొని తన కొడుకు పెరగడాన్ని చూడాలనుకుంటున్నారంటూ ఇలా మాట్లాడుకున్నారని తెలిపారు ఆశిష్ విద్యార్థి.
also read:Raai Laxmi:దివాళీ పార్టీలో రాయ్ లక్ష్మీ గ్లామర్ షో.. హాట్ లుక్స్‌తో అందరి చూపు తనవైపే!
ఆశిష్ విద్యార్థి సినీ కెరియర్..
ఆశిష్ విద్యార్థి సినీ కెరియర్ విషయానికి వస్తే 1993లో సర్దార్ అనే చిత్రం ద్వారా తన కెరీయర్ని మొదలుపెట్టారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి తెలుగులో(Tollywood) కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలుగులో 1998లో పాపే నా ప్రాణం అనే చిత్రంతో మొదలుపెట్టారు. ఆ తర్వాత 40 కి పైగా సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. చివరిగా 2026లో రాకాస అనే చిత్రంలో నటించారు. తెలుగు,తమిళ్, బెంగాలీ, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఎన్నో చిత్రాలలో నటించారు. అలాగే బుల్లితెర పైన కూడా పలు సీరియల్స్ లో నటించారు ఆశిష్ విద్యార్థి.




