Ravi Teja:ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు బాగానే ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. కానీ సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకున్నవి మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. అందుకున్న రెండు మూడు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ చరిత్రను తిరగరాశాయి. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓవర్సీస్‌లో మాత్రం కలెక్షన్స్ పరంగా డిఫరెంట్ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇండియాలో భారీగా ఆడిన సినిమాలు ఓవర్సీస్‌లో మాత్రం అటు ఇటుగా తేడా కొట్టేశాయి. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి? అందులో ఎలాంటి కలెక్షన్స్ రికార్డ్ చేశాయి? ఓవర్సీస్‌లో ఎలాంటి టాక్ అందుకున్నాయి? అనే వివరాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
సంక్రాంతి సినిమాల నుంచి..:
ఏడాది స్టార్టింగ్‌లోనే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ది రాజా సాబ్.. మన శంకర వరప్రసాద్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ది రాజా సాబ్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా, ఓవర్సీస్‌లో మాత్రం రూ.34 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసి శభాష్ అనిపించింది. ఇక మన శంకర వరప్రసాద్, ఎప్పటిలాగే తన దూకుడు ప్రదర్శిస్తూ రూ.43 కోట్ల దగ్గర ఆగింది.
ఓవర్సీస్‌లో ‘పెద్ది’ రికార్డ్ :
ఇక ఆ తర్వాత వచ్చిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తూ ఏకంగా ఓవర్సీస్‌లో రూ.53 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్ :
ఇక ఆ తర్వాత వచ్చిన సమంత ‘మా ఇంటి బంగారం’ సూపర్ డూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. ఇండియాలోనూ, అటుపక్క ఓవర్సీస్‌లోనూ సమంత ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్ రికార్డ్స్ నెలకొల్పింది.
ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా మొదటిసారి రూ.100 కోట్లు దాటడం ఒక విశేషం అయితే, ఎటువంటి స్టార్స్ లేకుండా కేవలం సమంత సింగిల్ హ్యాండ్‌తో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడం మరొక అద్భుతమని చెప్పాలి. ఓవర్సీస్‌లో ఈ సినిమా దాదాపు రూ.28 కోట్ల దగ్గర ఆగింది.
ALSO READ:Bigg Boss 10: ముఖేష్–దేబ్జానీ మధ్య క్యూట్ కెమిస్ట్రీ.. వర్షిణితో కొత్త ట్విస్ట్!
ఓవర్సీస్‌లో ‘ఇరుముడి’ కలెక్షన్స్:
ఇక ఫైనల్‌గా వచ్చిన ‘ఇరుముడి’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ సినిమాలో సినిమా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతుంది. అయితే ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ కొంచెం డౌన్‌గానే ఉన్నాయని చెప్పాలి. రూ.22 కోట్లకు ఈ సినిమా ఓవర్సీస్ లెక్కలు తేలాయి.
ఇండియాలో ‘ఇరుముడి’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా, ఓవర్సీస్‌లో మాత్రం ‘మా ఇంటి బంగారం’ లెక్కలను దాటలేకపోయింది. దీంతో సమంత ఫ్యాన్స్ ‘మా ఇంటి బంగారం’ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు. కొందరు సరదాగా ‘ఇరుముడి’(Ravi Teja) సినిమా ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించినా, ఓవర్సీస్‌లో మాత్రం ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌ను దాటలేకపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
ALSO READ:Rajamouli:రాజమౌళి బ్లూప్రింట్ రూల్స్ బ్రేక్ చేసిన హీరో ఇతడే..!
ఇండియా వర్సెస్ ఓవర్సీస్ కలెక్షన్స్ :
ఇండియాలో ‘మా ఇంటి బంగారం’ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ‘ఇరుముడి’ సినిమా మాత్రం రూ.200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. కానీ ఓవర్సీస్‌లో మాత్రం ఆ లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయి.
రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రియాక్షన్ వచ్చినా, మార్కెట్లు మాత్రం ఒకేలా లేవు అన్న విధంగా సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు. ‘ఇరుముడి’ ప్రస్తుతం రూ.230 కోట్లకు పైగా వరల్డ్ గ్రాస్‌తో దూసుకెళ్తుంది.




