Chiranjeevi :ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది ఏది అయినా ఉంది అంటే మాత్రం కళ్ళు మూసుకొని చెప్పేది చిరంజీవి రక్తాన్ని అమ్ముకున్నాడు అనేది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసిన విషయం అందరికీ తెలుసు. ఆపదలో ఉన్న వాళ్లకి ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేయడానికి ఈ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేశారు. ఈ బ్లడ్ బ్యాంక్‌లో చాలామంది మెగా అభిమానులు ఉచితంగా రక్తం ఇస్తూ ఉంటారు.
అయితే ఆ ఉచితంగా ఇచ్చిన రక్తాన్ని చిరంజీవి (Chiranjeevi)డబ్బు కోసం వేరే వాళ్లకి అమ్ముకుంటున్నారు అని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ నిందలు చిరంజీవిపై పడుతూనే ఉన్నాయి.
స్టేజిపై ఎమోషనల్‌గా స్పందించిన చిరంజీవి :
ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న చిరంజీవి తాజాగా స్టేజిపై ఈ విషయాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ‘‘నేను రక్తాన్ని అమ్ముకుంటున్నారు అంటూ నా మీద నిందలు వేస్తున్నారు. నాకేం అవసరం చెప్పండి? ఇల్లు లేదా? వాకిలి లేదా? డబ్బులు లేవా? కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ వస్తుంది. చిన్న యాడ్ చేసినా చాలు, రెమ్యూనరేషన్ హై రేంజ్‌లోనే వస్తుంది.
మరి నేను రక్తాన్ని అమ్ముకుంటానా? నా అభిమానులు ఎంతో ప్రేమగా, నా మీద నమ్మకంతో ఇచ్చిన రక్తాన్ని నేను డబ్బు కోసం అమ్ముకుంటాను. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారు? నాతో ఎలా వేయగలుగుతున్నారు?’’ అంటూ చాలా ఫుల్ ఎమోషనల్‌గా స్పందించారు.
also read:The Paradise : ది ప్యారడైజ్ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?
చిరంజీవికి సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పోస్టులు :
స్టేజీ పై మాట్లాడిన మాటల తర్వాత చాలామంది చిరంజీవిని సపోర్ట్ చేస్తూ చిరంజీవి అలాంటి వాడు కాదు అంటూ సోషల్ మీడియాలో బాగా ఆయన మాటలను ట్రెండ్ చేశారు. అయితే ఆయన మాట్లాడిన మాటలపై కొందరు నెగిటివ్‌గా కూడా రియాక్ట్ అవుతున్నారు.
also read:Vijay Deverakonda:విజయ- రష్మిక సోషల్ మీడియా ప్రేమ..!
వైరల్ అవుతున్న ల్యాబ్ టెక్నీషియన్ వీడియో :
మరీ ముఖ్యంగా తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. ఆ వీడియోలో మాట్లాడుతుంది ఒక ల్యాబ్ టెక్నీషియన్. అంటూ ఆయనను ఆయన పరిచయం చేసుకుంటారు. చిరంజీవి గారు బ్లడ్ అమ్ముకుంటున్నారు అని పక్కాగా చెప్పారు.
బ్లడ్ అభిమానులు ఫ్రీగానే ఇస్తున్నారు అని, ఆ బ్లడ్‌ని డొనేట్ చేసిన తర్వాత మూడు విభాగాలుగా, మూడు భాగాలుగా తీస్తారు అని, ఒకటి ప్లాస్మా, ఇంకొకటి ప్లేట్లెట్స్, ఇంకొకటి రెడ్ బ్లడ్ సెల్స్. ఇలా విడివిడిగా చేస్తారు అని చెప్పారు.
బ్లడ్‌కు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపణలు:
ఆ సమయంలోనే చిరంజీవి ఎవరికైనా అత్యవసర పరిస్థితులు, కావాలి అనుకున్న వాళ్లకి దాన్ని డబ్బులు డిమాండ్ చేసి అమ్ముతున్నారు అని, రూ.2,000, రూ.3,000, రూ.4,000 అంటూ రక్తాన్ని అమ్ముకుంటున్నారు అని మొహమాటం లేకుండా చెప్పారు.
అంతేకాదు, పూర్తిగా హోల్ బ్లడ్ కావాలి అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని, చిరంజీవి గారు మీరు స్టేజిపై అబద్ధం చెప్పారు. మీరు బ్లడ్ బ్యాంక్‌లో బ్లడ్ అమ్ముకుంటున్నారు. మీకు రెమ్యూనరేషన్ రావచ్చు. కానీ మీరు మాత్రం బ్లడ్ అమ్ముకుంటున్నారు అన్నది నూటికి నూరు శాతం నిజం అంటూ కాటుగా వీడియోలో చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన వీడియో :
దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. నిజంగానే బ్లడ్ అమ్ముకున్నాడా చిరంజీవి అన్న విధంగా జనాలు ఆలోచిస్తున్నారు. దీనిపై చిరంజీవి ఎంత త్వరగా రియాక్ట్ అయితే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్.
చాలా తప్పు చిరంజీవి గారు 😔😔🙏🙏 pic.twitter.com/A4gRLU53iK
— Balraju Chowdary (@ZingZing_Zack) September 23, 2026




