Monday, November 23, 2026
HomeLATESTAnanya Sharma:దేవుడంటే నమ్మకం లేదు.. నటి అనన్య కామెంట్స్..!

Ananya Sharma:దేవుడంటే నమ్మకం లేదు.. నటి అనన్య కామెంట్స్..!

Ananya Sharma: ప్రముఖ హీరోయిన్ అనన్య శర్మ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తనకు దేవుడంటే నమ్మకం లేదు అంటూ కామెంట్ చేసింది.

on
- Advertisement -banner Ad

Ananya Sharma:30 వెడ్స్ 21 అనే వెబ్ సిరిస్ తో ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి అనన్య శర్మ. ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తూ ఉన్నది. నవంబర్ 27న ఆమె నటించిన హై సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ చిత్రంలో అనన్య ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తన వ్యక్తిగత ఆలోచనలు, మూఢనమ్మకాల గురించి పలు విషయాలను తెలిపింది.

దేవుడంటే నమ్మకం లేదు..

అనన్య(Ananya Sharma) మాట్లాడుతూ.. “తనకు దేవుడు, భక్తి , పూజలు విషయంలో పెద్దగా నమ్మకం లేదంటూ తెలియజేసింది.. తను పూర్తిగా నాస్తికురాలని కూడా పూర్తిగా చెప్పలేనని, దేవుడు విషయంలో న్యూట్రల్ గా ఉంటానంటూ వెల్లడించింది.సాధారణంగా ఎక్కువగా గుడులకు వెళ్లడం, పూజలు చేయడం వంటివి అలవాటు లేదు అని.. పూజలు చేస్తే జీవితంలో సమస్యలు తొలగిపోతాయని, ఏదో అద్భుతం జరుగుతుందని విషయాన్ని తాను నమ్మనని కూడా తెలియజేసింది. తాను పూజలు చేయకపోయినా, ఇతరులు దేవుడని నమ్మడాన్ని ఎప్పుడు తాను తప్పు పట్టని అంటూ కూడా వెల్లడించింది అనన్యశర్మ.

- Advertisement -
Advertisement

also read:Sharwanand:నా కెరీర్‌కు వాళ్లే పిల్లర్స్.. నలుగురు డైరెక్టర్లకు శర్వానంద్ థ్యాంక్స్!

కానీ అందరినీ గౌరవిస్తాను..

ఎవరైనా పూజలు చేస్తూ ఉంటే వారితో కలిసి కూర్చొని అక్కడ వాటిని గౌరవిస్తానని, తాను నమ్మక పోయినంతమాత్రాన ఎదుటివారి నమ్మకాన్ని ఎప్పుడూ కూడా కించపరిచేలా ఏ పనులు కూడా చేయనని తెలియజేసింది. రామాయణం, కృష్ణుడు వంటి ఇతిహాసాల గురించి తనకు ఎప్పుడు తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది అంటూ అనన్య తెలిపింది. చాలామంది వాటిని మైథాలజిక్ గా భావిస్తూ ఉంటారు.. అయితే తాను మాత్రం వాటిని ఒక చరిత్రగా నమ్ముతారని తెలియజేసింది.. జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు అవి ఎందుకు వచ్చాయా అనే విషయం పైనే ఆలోచిస్తాను దేవుడు తనకే ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడతారు అని మాత్రం అసలు అనుకోనని తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Mahesh Babu:మహేష్ బాబు లుక్‌పై సోషల్ మీడియాలో చర్చ.. అస్థిపంజరంలా మారారంటూ ట్రోల్స్!

భవిష్యత్తులో ఆలోచన మారవచ్చు..

ప్రస్తుతం తనకి దేవుడు పైన ఎలాంటి ప్రత్యేకమైన భక్తి లేదని చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మారుతున్నాయి.. అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాల పైన తన ఆలోచన మారే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించింది. వయసు పెరిగేకొద్దీ దేవుడు పైన నమ్మకం కలగొచ్చునేమో నని, అయితే ప్రస్తుతానికి మాత్రం తనకు అలాంటి విశ్వాసం లేదని వెల్లడించింది. ఈ విషయంపైన పలువురు నేటిజన్స్ పలు భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే ఇతరుల విశ్వాసాల పట్ల తనకి ఉన్న గౌరవాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది అనన్య శర్మ. రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించి మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులైతే కోరుకుంటున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you