Mahesh Babu: సినిమా రంగంలో స్టార్‌డమ్‌ను కొనసాగించాలంటే నటీనటులు తమ ఫిట్నెస్, అందం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో ఇది మరింత ప్రత్యేకం. 51 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా కనిపిస్తూ, తన లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఫోటోలో మహేష్ బాబు కనిపిస్తున్న తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, నెటిజన్ల ట్రోల్స్‌కు కారణమైంది.
కార్తికేయ బర్త్‌డే సందర్భంగా ప్రత్యేక ఫోటో :
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు, నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్తికేయతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో మహేష్ బాబు ఒక కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోగా, ఎదురుగా కార్తికేయ కనిపిస్తున్నారు. వీరిద్దరూ ఏదో విషయంపై సీరియస్‌గా చర్చిస్తున్నట్లుగా ఫోటో ఉంది.
మహేష్ బాబు లుక్‌పై నెటిజన్ల కామెంట్స్ :
అయితే ఈ ఫోటోలో అందరి దృష్టిని ఆకర్షించింది మహేష్ బాబు శరీరాకృతి. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా కోసం ప్రత్యేకమైన లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ క్రమంలో గతంతో పోలిస్తే ఆయన శరీరాకృతిలో మార్పులు కనిపిస్తున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా లూజ్ టీ షర్ట్, ప్యాంట్లో ఆయన కాళ్లు చాలా సన్నగా కనిపించడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి.
ALSO READ: Neethu Master:ఆరు వారాలకే ఎలిమినేషన్.. నీతూ నటరాజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
డైట్ పేరుతో మరీ ఇంతలా బరువు తగ్గారా? అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే, ఇంకొందరు ఆయన లుక్‌పై వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే హీరోల రూపురేఖల్లో కూడా భారీ మార్పులు ఉంటాయంటూ మీమ్స్ పెడుతున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న అభిప్రాయాలు మాత్రమే.
అభిమానుల్లో మొదలైన ఆందోళన :
మరోవైపు మహేష్ బాబు అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో లుక్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఎంతో హుందాగా, ఫిట్‌గా కనిపించే మహేష్‌ను ఈ ఫోటోలో చూసి ఆశ్చర్యపోతున్నారు. సినిమా కోసం ఎంతటి కష్టాన్నైనా తీసుకోవడం అభినందనీయమే అయినప్పటికీ, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.
ALSO READ: Meenakshi Chaudhary:తన క్రష్ గురించి బయటపెట్టిన మీనాక్షి చౌదరి.. ఫ్యాన్స్ ఫిదా!
ఇదిలా ఉంటే, ‘వారణాసి’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అవుతున్న ఫోటో సినిమాపై మరోసారి చర్చకు దారితీసింది. అయితే మహేష్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో కేవలం ఫోటో ఆధారంగా నిర్ణయానికి రావడం సరికాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.




