Wednesday, November 4, 2026
HomeLATESTRajeev Kanakala:విశ్వంభర సినిమా ఆలస్యంపై రాజీవ్ కనకాల క్లారిటీ..!

Rajeev Kanakala:విశ్వంభర సినిమా ఆలస్యంపై రాజీవ్ కనకాల క్లారిటీ..!

Rajeev Kanakala: చిరంజీవి విశ్వంభర సినిమా ఆలస్యం పై రాజీవ్ కనకాల చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Rajeev Kanakala:మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంభర. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో మొదలుపెట్టినప్పటికీ.. ఇప్పటికీ ఈ సినిమా విడుదల కాలేదు. దీంతో ఈ సినిమా ఈ ఏడాది కూడా విడుదల అయ్యే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. యువి క్రియేషన్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రాబోతోంది. చిరంజీవి చాలా కాలం తర్వాత మళ్లీ ఇలాంటి జోనర్ లో సినిమా చేస్తూ ఉండడంతో మెగా అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు.

విశ్వంభర ఆలస్యం పై రాజీవ్ కనకాల క్లారిటీ..

కానీ ఈ సినిమా విడుదల తేదీ విషయం పైన మాత్రం అభిమానులకు పెద్ద నిరాశనే కలిగిస్తోంది. అయితే ఈ సినిమా ఆలస్యం కావడానికి గల కారణాలను తాజాగా నటుడు రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల (Rajeev Kanakala)కూడా ఒక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా సిజి విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల ఆలస్యం అవుతుందని, ఇవి ఇంకా పర్ఫెక్ట్ గా రావాలని వర్క్ చేస్తున్నారు . చిరంజీవి సినిమా అంటే అంత స్టాండర్డ్స్ ఉండాలి కదా.. మేకింగ్ అంతా ఓకే కానీ, విఎఫ్ఎక్స్ దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చిందంటూ తెలియజేశారు రాజీవ్ కనకాల.

- Advertisement -
Advertisement

ALSO READ:SKN:ఇండస్ట్రీని గౌరవించడం నేర్చుకోండి.. రాధిక ఆప్టేపై నిర్మాత షాకింగ్ పోస్ట్..!

రెండేళ్లుగా ఆడియన్స్ ముందుకు రాని విశ్వంభర..

విశ్వంభర చిత్రంలో త్రిష చిరంజీవికి జోడిగా నటిస్తున్నారు. అలాగే ఆశికా రంగనాథన్, సురభి, ఈషా చావ్లా కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చిత్రబృందం ప్లాన్ చేస్తూ ఉందట.. నిజానికి 2024 సంక్రాంతికి విశ్వంభర సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది.. రామ్ చరణ్ నటించిన ఒక సినిమా కోసం ఈ సినిమాని మొదట పోస్ట్ పోన్ చేశారు. అప్పటినుంచి ఆడియన్స్ కి బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Ramayana Movie:రామాయణం అడ్వాన్స్ బుకింగ్స్ తో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

వచ్చే ఏడాదైనా ప్రేక్షకులు ముందుకు వస్తుందా?

విశ్వంభర సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడంతో వాటికి నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో విఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉందంటూ ట్రోల్ చేశారు. ఆ తర్వాత రామ రామ పాట పెద్దగా వైరల్ కాకపోవడంతో కొద్దిరోజులు ఈ సినిమాని సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇక చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో కాకా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది విశ్వంభర సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you