SKN:తెలుగు సినీ పరిశ్రమలో నటించి ఇతర ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ స్టార్డం అందుకున్న తర్వాత టాలీవుడ్ పరిశ్రమను, మేకింగ్ విధానాలను, సంస్కృతి పైన కొంతమంది మాట్లాడిన మాటలు తెలుగు ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంటాయి. అలా ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమ పైన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపాయి.. టాలీవుడ్ లో పురుషాధిక్యత పరిశ్రమగా ఆమె మాట్లాడిన మాటలు, వయసు మళ్ళిన హీరోల సరసన నటించడంపై , సెట్స్ లో ప్యాడింగ్స్ వాడడంపై మాట్లాడుతూ అసౌకర్యానికి గురయ్యానంటూ ఆరోపణలు చేసింది.
రాధిక ఆప్టే మాటలకు ఎస్ కే ఎన్ రివర్స్ కౌంటర్..
అవకాశాలు ప్రతిభను చూసి ఇవ్వరని, కేవలం తెల్లటి చర్మం ఉందనే కారణంతోనే నార్త్ హీరోయిన్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నారంటూ ఘాటుగానే విమర్శలు చేసింది. గతంలో హీరోయిన్ తాప్సి, పూజా హెగ్డే, జాన్వీ కపూర్ వంటి వారు దక్షిణాది సిని పరిశ్రమ పైన కూడా పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయాల పైన పరోక్షంగా ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించిన ఎస్ కే ఎన్(SKN) సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలపైన తీవ్రస్థాయిలో వేదిక పైన విరుచుకుపడ్డారు.
ALSO READ:Ramayana Movie:రామాయణం అడ్వాన్స్ బుకింగ్స్ తో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?
తక్కువ చేసి మాట్లాడడం సరికాదు..
దక్షిణాదిలో అవకాశాలు సంపాదించుకొని పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత అదే పరిశ్రమను, ఇక్కడి కథలను సంస్కృతిని కించపరచడం చాలా దురదృష్టకరమని, ప్రతి నటుడుకి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. అయితే నిర్మాణాత్మక విమర్శకు.. ఆశ్రమం ఇచ్చిన పరిశ్రమను ఎంపిక చేసుకొని మరీ తక్కువ చేసి మాట్లాడడానికి చాలా తేడా ఉంటుందని.. తెలుగు దక్షిణాది సినీ పరిశ్రమకు ప్రత్యేకమైన సాంస్కృతిక అస్తిత్వం కథ విలువలు ఉన్నాయి .వేరే ప్రాంతం వ వింతగా తోచే అంశాలు మా సంస్కృతిలో అవి చాలా సహజమైనవి కావచ్చు.. గౌరవం అనేది కూడా రెండు వైపులా ఉండాలి అవకాశాలు వచ్చినప్పుడు అనుభవించి ఆ తర్వాత సంస్కృతిని అవమానించకూడదు అంటూ విమర్శలు చేయడం చాలా తప్పు.. మిమ్మల్ని గౌరవించిన పరిశ్రమను మీరు గౌరవించండి అంటూ ఎస్కేయన్ గట్టి కౌంటర్ వేశారు. ఇందుకు సంబంధించి ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది వాగింది నువ్వే కదా, మళ్ళీ ఏంటి నీతులు చెప్తున్నావ్.. తెలుగు స్టేజ్ మీద తెలుగు అమ్మాయిలనే తక్కువ చేసి మాటలాడావ్, మళ్ళీ వేరే వాళ్ళు ఎలా మాట్లాడాలో చెప్తున్నావ్..
తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి అంటే, నువ్వు ఓవరాక్షన్ ఆపేయాలి, ఏడుపోస్తే ఏడ్వాలి, లేదంటే లేదు
https://t.co/JljG660SQq
— Pointing Out (@Pointingoutoffl) November 4, 2026
ALSO READ:Bigg Boss 10:ఈ వారం నామినేషన్ లో ఉండే కంటెస్టెంట్స్ ఎంత మందో తెలుసా..?
ఎస్కేఎన్ కి ఆడియన్స్ రివర్స్ కౌంటర్..
ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది సమర్థిస్తున్నప్పటికీ మరి కొంతమంది గతంలో ఎస్కేఎన్ మాట్లాడిన వ్యాఖ్యలను వైరల్ గా చేస్తూ మేము తెలుగు మాట్లాడే అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలకు ఎక్కువగా ప్రోత్సహిస్తామంటూ గతంలో మాట్లాడిన ఒక వీడియోని రివర్స్ కౌంటర్లో వైరల్ చేస్తున్నారు. గతంలో హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే విధంగా వైరల్ గా చేస్తున్నారు. మొత్తానికి రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలకు సైతం కౌంటర్ వేశారు ఎస్కేఎన్.
Accepting roles, working in South Indian cinema, gaining recognition and opportunities here, and then years later criticising the same industry, its stories and cultural traditions is becoming an unfortunate pattern.
Every actor has the right to express an opinion. But there is a difference between constructive criticism and selectively looking down upon an industry that welcomed you.
#Telugucinema and #SouthIndian cinema have their own cultural identity, traditions and storytelling values. What may seem unusual to someone from another region can be perfectly normal within our culture.
Respect should be mutual. You cannot celebrate the opportunities and later disrespect the culture behind them.
Constructive criticism is always welcome. Selective criticism and cultural superiority are not.
Respect the industry that respected you.
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 4, 2026




