Wednesday, November 4, 2026
HomeLATESTRamayana Movie:రామాయణం అడ్వాన్స్ బుకింగ్స్ తో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

Ramayana Movie:రామాయణం అడ్వాన్స్ బుకింగ్స్ తో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

Ramayana Movie: రామాయణం సినిమా 15 రోజులకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా ఊహించని రీతిలో కలెక్షన్లు వస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Ramayana Movie:రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం రామాయణం. ఈ సినిమా డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమా పైన అంచనాలను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. సుమారుగా 4000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో రెండు భాగాలుగా రామాయణ సినిమాని తెరకెక్కించారు.

15 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..

తాజాగా ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సినిమా విడుదలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 100 కోట్లు మార్కును దాటింది. అలా వద్ద కోట్ల మార్కును దాటిన చిత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు వాటి లిస్టులోకి రామాయణం(Ramayana Movie) సినిమా కూడా చేరింది. దసరా పండుగకు కొద్దిరోజులు ముందు నుంచి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్ 15 రోజులు ముందే మొదలు అవడంతో రామాయణం సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ గా మారుతోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Bigg Boss 10:ఈ వారం నామినేషన్ లో ఉండే కంటెస్టెంట్స్ ఎంత మందో తెలుసా..?

అడ్వాన్స్ బుకింగ్స్లో పెరుగుతున్న జోరు..

రామాయణం మొదట బుకింగ్స్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ రోజులు గడిచే కొద్దీ ఈ సినిమా పైన మరింత ఆసక్తి పెరిగి, అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే జరుగుతున్నది. మొదట ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాలలో మాత్రమే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలుపెట్టారు. అయితే అది కూడా అక్కడ కొన్ని పరిమిత స్క్రీన్ లకు మాత్రమే ఇచ్చారట. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అక్కడ ప్రారంభం కాలేదు. అందుకు కారణం ధర్మా ప్రొడక్షన్ అధిక ఆదాయ వాటా కోసం ఎగ్జిబిటర్లతో చర్చలు జరుపుతూ ఉండడంతో ప్రారంభం కాలేదు. గత శుక్రవారం రోజున ఒప్పందం కుదుర్చుకోవడం తో చాలా థియేటర్లలో స్క్రీన్ లను జోడించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Renu Desai:పవన్ కోసం రేణు దేశాయ్.. షారుఖ్ కోసం కరణ్.. అప్పట్లో ఏం జరిగిందంటే?

పెరుగుతున్న స్క్రీన్లు..

గడిచిన మూడు రోజులుగా రామాయణ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే అమ్మకాలు పెరిగాయి. క్లాస్ ఏంజెల్ సినిమా ప్రీమియర్స్ లో జరిగిన తర్వాత అమెరికాలో కూడా టికెట్లు బాగా అమ్ముడుపోతున్నాయి. మంగళవారం రోజుకి ఈ సినిమా స్క్రీన్ల సంఖ్య 5000 దాటింది. గడిచిన 24 గంటలలో 1500కు పైగా స్క్రీన్లు కొత్తగా యాడ్ అయ్యాయి. నవంబర్ మూడవ తేదీ నాటికి భారతదేశంలో అడ్వాన్స్ అమ్మకాల ద్వారా 58 కోట్ల రూపాయల వరకు వసూలు లభించాయి. ఇందులో మొదటి రోజు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 27 కోట్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామాయణం సినిమా వారాంతం మొత్తం కూడా భారీగానే డిమాండ్ ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రామాయణం సినిమా ఇప్పటికే భారత దేశవ్యాప్తంగా అడ్వాన్సు బుకింగ్స్ లో 15 లక్షల టికెట్ల వరకు అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు బాహుబలి 2,RRR, పుష్ప 2, దురందర్2 వంటి ఇండియన్ సినిమాలు మాత్రమే రూ. 100 కోట్లకు పైగా అడ్వాన్సు బుకింగ్స్ లో రికార్డు సృష్టించాయి. వాటి లిస్టు లోకి రామాయణ సినిమా కూడా చేరింది. మరి మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ రాబడతాయో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you