Ali:సినీ స్టార్స్ రాజకీయాలకు రావడం చాలా చాలా కామన్. ఎంతోమంది స్టార్స్ ఇలా రాజకీయాలలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. కొంతమంది చరిత్ర సృష్టించడానికి ఇంకా ట్రై చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోయి “రాజకీయాలే మాకొద్దు రా బాబోయ్” అనే స్థాయికి వెళ్లిపోయారు. ఇలాంటి సిచువేషన్ చాలాసార్లు మనం గమనించే ఉంటాం. అయితే తాజాగా రాజకీయాల గురించి నటుడు ఆలీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీకి తన రాజకీయ ప్రయాణం ? అలాగే వైసిపిలో చేరడం ? అలాగే ఆ పార్టీకి దూరం కావడానికి గల కారణాలపై ప్రశ్నలు అడిగారు.. దీనిపై ఓపెన్ గా స్పందించాడు నటుడు అలీ.
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అలీ (Ali)ఆ సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే రాజకీయాలలో కొనసాగుతున్న సమయంలో తనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదని అసంతృప్తితో ఆయన ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. చివరికి 2024 లో ఆయన వైసీపీకి దూరమయ్యారు.
పదవుల ప్రయోజనాల కోసం చేరలేదు :
తాజాగా తన రాజకీయ ప్రయాణం పై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఆలీ “మొదటి నుంచి రాజకీయాలకు రావాలని ఆలోచన తనకు లేదు అని” నిర్మొహమాటంగా చెప్పేశారు. అనుకోని పరిస్థితుల్లోనే రాజకీయాలలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది అని తెలిపారు. ఎలాంటి పదవి లేదా వ్యక్తిగత ప్రయోజనం ఆశించకుండా వైసీపీలో చేరాను అని స్పష్టం చేశారు. తాను ఏదైనా ఆశించి పార్టీలో చేరి ఉంటే ఒకటి రెండేళ్లలోనే పార్టీని వీడి ఉండేవాడిని కానని ఆలీ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో తన సినిమాల పనులను పక్కనపెట్టి పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశాను అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం తాను చేసిన కృషి ప్రజలకు కూడా తెలుసు అని పేర్కొన్నారు.
ALSO READ:OTT:నో ముద్దులు, నో ఫైట్ సీన్స్..అయినా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇది!
కరివేపాకుల తీసి పారేశారు:
తను చేసిన కృషికి తగిన గుర్తింపు దక్కలేదని అసంతృప్తితో అలీ వ్యక్తం చేశారు. ఐదేళ్లకు ఒకసారి ఉపయోగించుకొని వదిలేస్తే ఏ వ్యక్తికైనా బాధ కలుగుతుంది కదా అని అన్నారు. తన పరిస్థితిని వివరిస్తూ “కరివేపాకుల తీసి పారేశారు” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా రంగమే తనకు అన్నం పెట్టింది అని.. రాజకీయాలు కాదు అని స్పష్టం చేశారు. సినీ రంగంలో తనకు ఎప్పటికీ మంచి గుర్తింపు ఉంటుంది అని ఆశించారు . రాజకీయాలలోకి వెళ్లిన దానిని కోల్పోవాల్సిన అవసరం నాకు లేదు అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
ALSO READ:Nayanthara: యశ్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార..!
మళ్లీ సినిమాలపైనే దృష్టి:
రాజకీయాలలో ఎదురైన అనుభవాల తర్వాత ఇక ఆ రంగం తనకు అవసరం లేదు అని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజకీయాలకు స్వస్థ చెప్పి తిరిగి తన అసలు వృత్తి సినిమాలపై దృష్టి సారించినట్లు వివరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. కొంత మంది అలీ చేసిన వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది నెగటివ్గా విమర్శిస్తున్నారు..!!




