Wednesday, September 16, 2026
HomeLATESTTollywood:పూజ చేస్తూ డేటింగ్ పై హింట్ ఇచ్చిన టాలీవుడ్ జంట..!

Tollywood:పూజ చేస్తూ డేటింగ్ పై హింట్ ఇచ్చిన టాలీవుడ్ జంట..!

Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన డైరెక్టర్ ఒక హీరోయిన్ తో కలసి వినాయకుడి పూజలో సందడి చేశారు.

on
- Advertisement -banner Ad

Tollywood:టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ గా, నటుడుగా పేరు సంపాదించిన తరుణ్ భాస్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో తన కామెడీ టైమింగ్ తో నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. గత కొద్దిరోజులుగా టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా తో ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన ఇప్పటివరకు అధికారికంగా ఈ జంట ప్రకటించలేదు. కానీ అప్పుడప్పుడు వీరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ జంట పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన(Tollywood) ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

వినాయకుడి పూజలో టాలీవుడ్ జంట..

నటుడు తరుణ్ భాస్కర్ స్వయంగా సోషల్ మీడియాలో ఎలాంటి క్యాప్షన్ రాయకుండా, ఫోటోలను షేర్ చేస్తూ ఈ జంట తమ రిలేషన్షిప్ గురించి ఇలా హింట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. వీటికి తోడు మంచు లక్ష్మి, ప్రగతి, శివాత్మిక మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ జంటకు ఆల్ ది బెస్ట్ , కంగ్రాట్స్ వంటివి చెప్పడం ఇప్పుడు రూమర్స్ కి మరింత బలం చేకూర్చిందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తరుణ్ భాస్కర్ తల్లి తో షాపింగ్ చేస్తూ ఈషా రెబ్బ కనపడిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

also read:Chiyaan Vikram:విక్రమ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. ‘అపరిచితుడు’ను మించిన ట్విస్ట్!

ఇప్పటికైనా అధికారికంగా ప్రకటిస్తారా?

దీంతో గత కొంతకాలంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ఇద్దరు కలిసి కనిపిస్తూ ఉండడం కూడా ఈ విషయానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ జంట మధ్య లవ్ రూమర్స్ వినిపించినప్పటికీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఈషాతో డేటింగ్ రూమర్స్ పైన తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈషా తో తనకు కేవలం స్నేహం మాత్రమే ఉందంటూ తెలియజేశారు. అంతేకాకుండా సరైన సమయంలో కూడా అన్ని విషయాలను తెలియజేస్తానంటూ తరుణ్ భాస్కర్ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Mahesh Babu :మహేష్ బాబు నెక్ట్స్ మూవీపై బిగ్ అప్డేట్.. నిజమైతే బాక్సాఫీస్ షేక్!

వార్తలకు మరింత బలం చేకూర్చిన వీడియో..

దీంతో ఇప్పుడు వినాయక చవితి పండుగను ఇద్దరు కలిసి సెలబ్రేషన్ చేసుకోవడం ద్వారా వీరి రిలేషన్షిప్ పైన పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి అఫీషియల్ గా ఈ జంట ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి. ENE రిపీట్ అనే చిత్రానికి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది గాయపడ్డ సింహం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో మంచి మార్కుల సంపాదించారు తరుణ్ భాస్కర్.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you