Monday, July 27, 2026
HomeLATESTAdarsha kutumbam:ఆదర్శ కుటుంబం సినిమా నుంచి చిట్టిబాబు వీడియో వైరల్..!

Adarsha kutumbam:ఆదర్శ కుటుంబం సినిమా నుంచి చిట్టిబాబు వీడియో వైరల్..!

Adarsha kutumbam: వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా నుండి వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు.

on
- Advertisement -banner Ad

Adarsha kutumbam:టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం. హౌస్ నెంబర్ 47 అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటించింది. ఈ సినిమాని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. తాజాగా చిత్ర బంధం ఒక వీడియోను కూడా విడుదల చేసింది.

ఆదర్శ కుటుంబంలో చిట్టిబాబుగా వెంకటేష్..

తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో వెంకటేష్ చిట్టిబాబు పాత్రలో కనిపించబోతున్నారు. ఒక పెద్ద బంగ్లా కనిపిస్తుంది. ఆ ఇంట్లోకి హీరో వెంకటేష్, శ్రీనిధి శెట్టి, కమెడియన్ రఘుబాబు ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత హీరోయిన్ శ్రీనిధి శెట్టి కిచెన్ లో ఏసీ నా.. నాన్న నువ్వు వంట చేసుకునేటప్పుడు హ్యాపీగా ఏసి వేసుకొని చేసుకోవచ్చు. అలాగే వాషింగ్ మిషన్ కూడా ఉంది. నీకు బాగా పని తగ్గిపోయినట్టే అంటూ హీరోయిన్ శ్రీనిధి చెప్పే డైలాగ్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది.. రఘుబాబు ,వెంకటేష్ మధ్య సంభాషణ కూడా కామెడీగా కనిపిస్తోంది. ముఖ్యంగా వెంకటేష్ చెప్పే డైలాగులు కూడా నవ్వులు పూయించేలా కనిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Nabha natesh: వెకేషన్ మోడ్.. ఫ్యామిలీ తో చిల్ అవుతున్న నభా నటేష్!

కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్న వెంకటేష్..

సహజమైన నటన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు హీరో వెంకటేష్. మరొకసారి ఆదర్శ కుటుంబంలో అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా చిట్టిబాబు పాత్ర వెంకటేష్ కెరియర్ లోని చాలా గుర్తుండిపోయే పాత్రలా కనిపిస్తోందని అభిమానుల భావిస్తున్నారు. అనుబంధాలు, ఆనందం , కుటుంబ విలువలకు ప్రతిరూపంగా ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్ర ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Bollywood :52 ఏళ్ళ వయసులో తనకంటే చిన్న వాడితో హీరోయిన్ డేటింగ్..!

అక్టోబర్ 2న విడుదల..

అక్టోబర్ రెండవ తేదీ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. అలాగే ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని నటీనటుల పాత్రలను కూడా పరిచయం చేస్తూ పోస్టర్లను విడుదల చేశారు. రేపటి రోజున ఈ సినిమా గురించి మరింత అప్డేట్ అందించబోతోంది చిత్ర బృందం. వెంకటేష్ ప్రస్తుతం హీరో గానే కాకుండా పలు చిత్రాలలో అతిధి పాత్రలో కూడా నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం(Adarsha kutumbam) సినిమా చేస్తున్న వెంకటేష్.. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you