Vijay Deverakonda:హీరో విజయ్ దేవరకొండ, ఆయన భార్య రష్మిక జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రణబాలి. ఈ చిత్రం అక్టోబర్ 16వ తేదీన దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను టి సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పైన అంచనాలు పెంచేయడమే కాకుండా ప్రశంసలు కూడా అందుకునేలా చేసింది. ఇప్పుడు రణబాలి సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కి సిద్ధమయ్యింది.
అభిమానుల కోసమే విజయ్ కీలక నిర్ణయం..
ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)మాట్లాడుతూ.. పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యంగా సినిమా టికెట్ల ధర పెంపు విషయం పైన విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. సాధారణ ప్రేక్షకులకు అనుకూలంగా ఉండేలా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇకపై తన చిత్రాలకు టికెట్లు రేట్లు పెంచడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజులలో సినిమా టికెట్లు రేటు పెరిగినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుకు ఉంది. అందుకే నిర్మాతలు దర్శకులతో మాట్లాడి నా సినిమాలకు టికెట్ ధరల పెంపు లేకుండా చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
also read:Rajamouli:పిల్లలొద్దనుకున్న రాజమౌళి.. కారణం?
టికెట్ ప్రైజ్ కాదు.. సినిమా ప్రేక్షకుడికి చేరువవ్వడమే ముఖ్యం..
సినిమా అనేది ఎక్కువమంది ప్రజలకు చేరువవ్వాలి. టికెట్ల రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడే.. థియేటర్లకు కూడా ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారని.. తక్కువ మందితో ఎక్కువ డబ్బులు రాబట్టడం అనేది చాలా కష్టము. కోట్ల మంది థియేటర్లలో సినిమాని చూడడమే తనకు ముఖ్యము అని విజయ్ దేవరకొండ తెలిపారు. విజయ్ దేవరకొండ తన సినిమాల పైన తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు ప్రశంసించడమే కాకుండా పలువురు నెటిజన్సు కూడా విజయ్ చేసిన పనిని మెచ్చుకుంటూ పలువురు హీరోలకు సలహా ఇస్తున్నారు. సినిమాలో కథలు లేకుండా కేవలం కలెక్షన్స్ కోసమే చాలామంది అడిగి మరీ సినిమా రేట్లు పెంచుకొని కలెక్షన్స్ సంపాదించుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇ
ఇక అలాంటివి చేయడం మానండి అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
also read:Toxic OTT:యశ్ టాక్సిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
రణబాలిపై విజయ్ దేవరకొండ కామెంట్స్..
రణబాలి చిత్రంలో కల్పిత హింస కాదని , 1800 కాలంలో జీవించడం అంటే చావు బ్రతుకు అనేటట్టుగా ఉండేది. ఎలాంటి చిన్న గొడవ అయినా సరే ప్రాణాల మీదకు వచ్చేది. ఆ కాలంలో మనుషులు అంత క్రూరంగా మొరటగా ఉండేవారని, చరిత్రలో ఆకలి తట్టుకోలేక ప్రజలు నల్ల మట్టి, చీమల పుట్టలోని గింజలు, చెట్ల బెరలు వంటివి తినేవారని తెలిపారు. చివరికి మనసులను చంపి తినే స్థాయికి కూడా వెళ్లారని తెలిపారు. అలాంటి వాస్తవాలతో పోలిస్తే తాము సినిమాలో చూపించింది చాలా తక్కువే అంటూ విజయ్ దేవరకొండ వివరించారు. సినిమా అనేది ఒక వినోదం కోసమే కాకుండా మన పూర్వీకులు కూడా ఎలాంటి పరిస్థితులు నుంచి వచ్చారు? ఆ విషయాలను సమాజానికి చూపించడం కూడా జరిగిందని, అందుకే రా అండ్ రస్టిక్ యాక్షన్ ని చూపించారని తెలిపారు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.




