Sunday, October 11, 2026
HomeLATESTRajamouli:పిల్లలొద్దనుకున్న రాజమౌళి.. కారణం?

Rajamouli:పిల్లలొద్దనుకున్న రాజమౌళి.. కారణం?

Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమెరుగని దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి వివాహం తర్వాత పిల్లల్ని వద్దనుకోవడం వెనుక అసలు కారణం వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Rajamouli:టాలీవుడ్ లో ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా పేరు సంపాదించి, వరల్డ్ వైడ్ టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన రాజమౌళి గురించి చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయాలని చాలామంది సెలబ్రిటీలు సైతం ఆశపడుతుంటారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చులకన అనే భావన నుంచి ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లారు రాజమౌళి. అలాంటి రాజమౌళి.. పెళ్లయి, కొడుకు ఉన్న ఆమెతో ప్రేమలో పడడం, ఆ తర్వాత వివాహం చేసుకోవడం, పిల్లలని వద్దనుకోవడం వంటివి జరిగాయి.. అసలు రాజమౌళి పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

వివాహం తర్వాత పిల్లల్ని వద్దనుకున్న రాజమౌళి..

రాజమౌళి 53వ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి(Rajamouli) గురించి కొన్ని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు ఆయనకు పేరు తీసుకురావడమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమను ఒక మెట్టు పైకి ఎక్కేలా చేశాయి. RRR చిత్రానికి గాను నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా తీసుకువచ్చేలా చేసింది. 1973లో కేవీ విజయంద్రప్రసాద్, రాజనందిని దంపతులకు రాజమౌళి జన్మించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ప్రముఖ రచయితగా పేరు సంపాదించారు.

- Advertisement -
Advertisement

వదిన సోదరినే వివాహం చేసుకున్న రాజమౌళి..

రాజమౌళి చిన్న వయసు నుంచే జులాయిగా తిరుగుతున్న సమయంలో తన వదిన శ్రీవల్లి చెప్పిన మాటలు తనని ఇండస్ట్రీలోకి తీసుకువచ్చేలా చేశాయి. అలా శాంతి నివాసం అనే సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న క్రమంలోనే రమ తో పరిచయం ఏర్పడగా.. అప్పటికే ఆమెకు వివాహమై ఒక కొడుకు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా రాజమౌళి ఆమెతో ప్రేమలో పడ్డారు. కీరవాణి, రాజమౌళి ఇద్దరూ కూడా అన్నదమ్ముల పిల్లలు అన్న సంగతి అందరికీ తెలిసిందే.. కీరవాణి భార్య శ్రీవల్లికి రమ సోదరి అవుతుంది. రాజమౌళికి రమ పరిచయం కావడానికి అక్కడే మొదట అడుగు పడింది.

also read:Toxic OTT:యశ్ టాక్సిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

- Advertisement -
Advertisement

అందుకోసమే పిల్లల్ని వద్దనుకున్న రాజమౌళి..

రాజమౌళి కూడా రాఘవేంద్రరావు శిష్యుడిగా శాంతినివాసం సీరియల్ కి దర్శకత్వం వహిస్తున్న సమయంలో రమాతో సన్నిహిత్యం పెరిగి, ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. రమకు అప్పటికే వివాహమై ఒక కుమారుడు ఉండి, తన భర్తతో విడాకులు తీసుకుని వేరేగా ఉండేది. ఈ విషయం రాజమౌళి కి కూడా తెలిసే.. ఆమెను వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇంట్లో పెద్దలందరిని ఒప్పించి మరి రాజమౌళి ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహమనంతరం కార్తికేయను తన సొంత కుమారుడు కంటే ఎక్కువగా రాజమౌళి చూసుకున్నారు. ఒకవేళ తనకు సంతానం కలిగితే కార్తికేయను సరిగ్గా చూసుకోలేనేమో అనుకున్నారట. అందుకే రాజమౌళి పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నారనే విధంగా వినిపిస్తుంటాయి.. మరి ఇందులో ఎంత నిజం అనేది తెలియాల్సి ఉంది. కానీ చాలా సందర్భాలలో కార్తికేయ మాత్రం రాజమౌళి గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంటారు.

also read:Garividi Lakshmi: గరివిడి లక్ష్మి సినిమాని రిజెక్ట్ చేసిన నలుగురు హీరోయిన్స్.. ఎవరెవరంటే

- Advertisement -
Advertisement

అమ్మాయిని దత్తత తీసుకున్న రాజమౌళి..

దీంతో రాజమౌళి ఒక ఆడపిల్లను దత్తకు తీసుకొని మరి పెంచుకున్నారు. రాజమౌళి పనిచేస్తున్న దాదాపు అన్ని చిత్రాలకు కుటుంబం అంతా కూడా కలిసి పనిచేస్తుంది. రాజమౌళి సోదరుడు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తారు. ఆయన భార్య సినిమాకి లైన్ ప్రొడక్షన్ గా వ్యవహరిస్తారు. రాజమౌళి భార్య కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఇక కుమారుడు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఇలా కుటుంబం అంతా కూడా సినిమా షూటింగ్లో పాల్గొంటూ సినిమాలను సరదాగా పూర్తి చేస్తుంటారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you