YouTuber :సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ గా భారీగా పాపులారిటీ సంపాదించిన తర్వాత ఆదాయాన్ని భారీగానే పొందుతూ ఉంటారు. మరి కొంతమంది కొన్ని తప్పులు చేస్తూ చిక్కిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో చాలామంది మీద కేసులు కూడా నమోదు అవుతున్నాయి. మై విలేజ్ షో, యూట్యూబ్ ఛానల్(YouTuber) ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల లో భారీగానే పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు అంజి మామ9 Anji mama). ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జీవితంలో ఎదురైన కష్టాలను సైతం పంచుకున్నారు.
ఈజీ మనీ పేరిట రూ.23 లక్షల భారీ మోసం..
నటుడుగా మారకముందు ఆయన ప్లంబర్ గా, ఎలక్ట్రీషియన్ గా పనిచేయడమే కాకుండా ఆర్ఎంపీ డాక్టర్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత వాటర్ ప్లాంట్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న సమయంలో ఏ రంగంలో కూడా ఆశించిన స్థాయిలో స్థిరపడలేకపోవడంతో స్నేహితులతో కలిసి ఒక ఈజీ మనీ స్కీమ్ లో అడుగు పెట్టారు. అయితే ఆ నిర్ణయం తనని తీవ్ర నష్టాన్ని కలిగించేలా చేసిందని సుమారుగా 23 లక్షల రూపాయల వరకు తాను కోల్పోయానని తెలిపారు. ఎవరు కూడా తొందరపడి సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను ఎంచుకోకండి అలాంటి వాటిని ప్రోత్సహించవద్దండి అంటూ తన అనుభవంతో తెలిపారు.
also read:Sowcar Janaki:నటి షావుకారు జానకి కన్నుమూత..!
క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న అంజి మామ..
ప్రస్తుతం నటనలో అవకాశాల కోసం తాను ప్రయత్నిస్తున్నానని , హైదరాబాద్ నగరం వేదికగా క్యాబ్ నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు కుటుంబ అవసరాల కోసం ప్రతినెల 50 వేల రూపాయలు పంపించాల్సి ఉంటుందని అందుకే ఈ పని చేస్తున్నాను అంటూ తెలిపారు అంజి మామ. డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించినప్పటికీ కొంతమంది ప్రయాణికులు తనని సులభంగా గుర్తు పడుతున్నారని వెల్లడించారు. వరుస కష్టాలు ఆర్థిక భారాల మధ్య కొన్నిసార్లు తాను హైదరాబాదు నుండి సొంతూరు కి వెళ్లిపోవాలనిపించేలా ఆలోచనలు వస్తూ ఉంటాయని ఎమోషనల్ గా మాట్లాడారు.
also read:OTT MOvies: ఈ ఒక్కరోజే 19 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. వీకెండ్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
సొంత ఊరిలో ఎకరం పొలం, 4 గేదెలు ఉంటే చాలు..
మనం హ్యాపీగా జీవనం కొనసాగించడానికి సొంత ఊరులో ఒక ఎకరం పొలం నాలుగు గేదెలు ఉంటే చాలు హాయిగా బ్రతికేయవచ్చు అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. అంజి మామ తెరపై నవ్వులు పూయించే నటుడి అయినప్పటికీ తన మనసులో ఎంత బాధ పెట్టుకుని అభిమానులను నవ్వించడంతో పలువురు నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




