Brahmanandam:తెలుగు సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ కమెడియన్ గా పేరు సంపాదించిన బ్రహ్మానందం కొన్ని దశాబ్దాలుగా తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. సుమారుగా 1250 కి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్ రికార్డు లోకి ఎక్కిన బ్రహ్మానందం ఇటీవల కాలంలో సినిమాలలో కాస్త నటించడం తగ్గించినప్పటికీ, బ్రహ్మానందానికి సంబంధించి మీమ్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే బ్రహ్మానందం తన ఇన్నేళ్ల సినీ కెరియర్ లో ఎప్పుడూ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు తాజాగా తన సొంత అన్నయ్య అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమ్ముడు పలకరింపు కోసం ఆశగా ఎదురు చూస్తున్న బ్రహ్మానందం సోదరుడు..
వృద్ధాప్యంలో తమ్ముడు ప్రేమానురాగం కోసం తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని బ్రహ్మానందం అన్నయ్యను అంటూ ఒక పెద్దాయనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బ్రహ్మానందం(Brahmanandam) సోదరుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “మేము అందరం ఆరుగురు అన్నదమ్ములం ఐదో వారే బ్రహ్మానందం, నలుగురు చనిపోయారు. ఉన్నది మేమిద్దరమే. ఎప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను. బ్రహ్మానందం ఎప్పుడైనా ఫోన్ చేసి పలకరిస్తారేమో అని చాలా ఆశగా ఎదురుచూస్తున్న.. హైదరాబాదు నుంచి ఆయనకు షూటింగ్ లేనప్పుడైనా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా.. రేయ్ అన్నయ్య ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావేమో అని అడుగుతాడేమో అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని తెలిపారు.
గొప్పవాళ్లు పలకరించినప్పుడు నాలాంటి చిన్న వాళ్లకు సంతోషమే..
గొప్ప వాళ్ళ పలకరించినప్పుడు నాలాంటి చిన్న వాళ్లకు సంతోషమే కదా .. చనువుగా మాట్లాడడానికి బాగుంటుంది మనకు మనంగా వాళ్ళ దగ్గరికి వెళితే ఏమవుతుందో అనే భయం ఉంటుంది.. వాడు ఏదో అంటాడని కాదు కానీ నాకు అలాంటి ఫీలింగే ఉందని తెలిపారు శ్రీనివాసరావు. ఎలా ఉన్నావు అన్నయ్య అని ఒక్క మాట అడిగితే చాలు.. నాకు ఉండే బాధలన్నీ కూడా పోతాయని, నాకు డబ్బు అక్కర్లేదు ప్రేమగా పలకరిస్తే చాలు అని బ్రహ్మానందం సోదరుడు శ్రీనివాసరావు తెలిపారు.
మా ఊరికి వచ్చాడంట.. కానీ కలవలేదు..
ఇటీవల బ్రహ్మానందం మా ఊరికి వచ్చాడంట. నాకు తెలియదు అయినా నేను వెళ్లలేను. ఎందుకంటే నేను నెమ్మదిగా నడుస్తాను అంతమంది జనంలోకి ఎలా వెళ్లాలో తెలియదు. వాడు నా ఇంటికి రాకపోయినా పర్వాలేదు.. ఎవరితోనైనా కబురు పంపి హైదరాబాదుకి రా అన్నయ్య ఒకసారి చూడాలని ఉంది పిలిస్తే చాలు నా కూతుర్లు అన్నం పెడతారు.. నేను బ్రహ్మంగారి గుడిలో పూజారిగా చేస్తున్నాను. నాకు ఉన్నంతలోనే హాయిగా ఉంటున్నాను. కానీ పలకరింపు లేదు ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు అంటూ బ్రహ్మానందం సోదరుడు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ప్రస్తుతం శ్రీనివాసరావు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయం పైన బ్రహ్మానందం ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
నా ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేసింది, ఈ ఇల్లు కట్టించింది తమ్ముడు బ్రహ్మానందమే
ఆ రోజుల్లో 50 వేలకు పైగా ఖర్చు చేసి నా బిడ్లల పెళ్లిళ్లు చేశాడు తమ్ముడు
–బ్రహ్మానందం గారి అన్నయ్య శ్రీ వదన్ గారు
( పూర్తిగా తెలియకుండా ఓ రెచ్చిపోతున్నారు ఎందుకు కామెంట్స్ లో ఆయన నెగటివ్ గా ఏం… https://t.co/87TxZmfxnc pic.twitter.com/myGw77mEPf
— AVM (@AvmNews7) August 19, 2026




