Sowcar Janaki:సీనియర్ నటి షావుకారు జానకి గత కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా గురువారం మరో సారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రోజున నటి షావుకారు జానకి తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన సినీ సెలబ్రిటీలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈమె వయసు 94 సంవత్సరాలు. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో సుమారుగా 450కు పైగా చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.
నాలుగు తరాల నటీనటులతో నటించిన ఘనత..
ముఖ్యంగా నటి షావుకారు జానకి(Sowcar Janaki) నాలుగు తరాల నటీనటులతో నటించిన ఘనత అందుకుంది. 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన షావుకారు జానకి.. అసలు పేరు శంకరమంచి జానకీ.. చిన్నప్పటి నుంచి ఎక్కువగా కళల మీద ఆసక్తి ఉండడంతో తన 14 ఏళ్ల వయసులోనే మద్రాస్ కు వెళ్లి మరి ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్టుగా తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత చిన్న వయసులోనే వివాహం జరగడం, ఆ సమయంలో కనీసం తినడానికి కూడా లేని పరిస్థితులలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నది షావుకారు జానకి.
also read:OTT MOvies: ఈ ఒక్కరోజే 19 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. వీకెండ్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
కుటుంబ ఆకలి తీర్చడానికి నటిగా ప్రయాణం..
అలా పిల్లల ఆకలి తీర్చడానికి , కుటుంబం భారాన్ని మోయడానికి తన భర్త అనుమతితో సిని ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేసింది. 1950లో ఎన్టీఆర్ సరసన ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో షావుకారు అనే చిత్రంతో హీరోయిన్గా సినీ ఎంట్రీ ఇచ్చింది. అలా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈమె ఆ సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకుని షావుకారు జానకిగా పేరు శాశ్వతంగా పెట్టుకుంది. తెలుగు , తమిళ్ ,కన్నడ, మలయాళం వంటి భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది.
also read:Tollywood: తెలంగాణ సీఎం నా క్లాస్ మెట్.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్..!
నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన నటి..
ముఖ్యంగా శివాజీ గణేషన్, రాజకుమార్, నాజర్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎంజీఆర్ వంటి హీరోలు అందరి సరసన నటించింది. ముఖ్యంగా నలుగురు ముఖ్యమంత్రిలతో కలిసి పని చేసిన ఏకైక సీనియర్ నటిగా ఒక అరుదైన రికార్డును సైతం సొంతం చేసుకుంది షావుకారు జానకి. ఆరోజులలోనే మద్రాస్ లో సొంత ఇల్లు నిర్మించుకొని ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన షావుకారు జానకి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో షావుకారు జానకిని సత్కరించింది.




