Thursday, August 20, 2026
HomeLATESTTicket price:తెలంగాణలో టికెట్ల ధరలు పెంపు..!

Ticket price:తెలంగాణలో టికెట్ల ధరలు పెంపు..!

Ticket price:తెలంగాణ ప్రభుత్వం బుధవారం రోజున టికెట్ల ధరల పెంపు, థియేటర్ల నిర్వహణపైన కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

on
- Advertisement -banner Ad

Ticket price:తెలుగు రాష్ట్రాలలో సినిమా టికెట్ల ధరలు పెంపు వల్ల చాలామంది సినీ ప్రేక్షకుల సినిమా థియేటర్లకు రావడంలేదని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తెలియజేయడమే కాకుండా సామాన్యులు కూడా తెలియజేశారు. అందుకే కొన్ని సినిమాలకు ప్రత్యేకించి మరీ సినిమా టికెట్లు పెంచకుండా ఉంటూ తమ సినిమాలను సక్సెస్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం బుధవారం రోజున టికెట్ల ధరల పెంపు, థియేటర్ల నిర్వహణపైన కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

థియేటర్లలో భారీ మార్పు..

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణంలోకి తీసుకొని థియేటర్లను కొత్తగా వర్గీకరించడంతోపాటుగా సామాన్య ప్రేక్షకులకు వినోదాన్ని అందించేలా ఉండాలని నిర్దిష్ట ధరలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డాల్బీ 7.1,2k, 4k స్క్రీన్లు కలిగిన థియేటర్లను(Ticket price) స్పెషల్ థియేటర్లు గా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రోజువారి సోలార్ సంఖ్యను నాలుగు నుంచి ఐదు పెంచి వారికి వెలుసుబాటు కల్పించేలా చేసింది. కానీ ఈ అదనపు షోను మాత్రం కచ్చితంగా చిన్న చిత్రాలకే కేటాయించాలని నిబంధనను కూడా తీసుకురావడం గమనార్హం.

- Advertisement -
Advertisement

ALSO READ:Pavithra Gowda:నటి పవిత్ర గౌడ మాజీ భర్త మృతి.. అసలు కారణం ఇదేనా?

తెలంగాణలో తాజాగా పెంచిన టికెట్ ధరలు ఇవే..

కొత్తగా తీసుకువచ్చిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఏసి, నాన్ ఎసి, స్పెషల్ థియేటర్ లోని నాన్న ప్రీమియం ప్రీమియం విభాగాలకు గరిష్ట ధరలను కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

నాన్ ప్రీమియం సీట్లకు కనిష్టంగా 30 నుంచి 70 రూపాయల వరకు

ప్రీమియం సీట్లకు రూ.50 నుంచి 100 రూపాయల వరకు ఉండనున్నాయి.

- Advertisement -
Advertisement

ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం ధర రూ.50 నుంచి 150 రూపాయల వరకు ఉండనున్నాయి.

ప్రీమియం విభాగానికి రూ.100 నుంచి 250 వరకు గరిష్ట పరిమితి విధించారు.

ఏ రకమైన థియేటర్లో నాయన సరే సామాన్యుల కోసం కనీసం 25 శాతం వరకు సీట్లను నాన్ ప్రీమియం కేటగిరీలో ఉంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు మాత్రమే ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. థియేటర్లు దొరకక ఇబ్బంది పడుతున్న చిన్న నిర్మాతలు చిన్న సినిమాల మొరను ఆలకించిన ప్రభుత్వం.. పెంచిన ఐదో షోను మాత్రం చిన్న సినిమాలకే కేటాయించాలని ఒక మెలిక పెట్టడం జరిగింది.

ALSO READ:TV:గురువారం టీవీలో సినిమాల సందడి.. పూర్తి లిస్ట్ ఇదే!

చిన్న చిత్రాలకు ఇక నో టెన్షన్..

దీనివల్ల చిన్న చిత్రాలకు కూడా థియేటర్ల కొరత ఉండదని భావించవచ్చు. అలాగే 100 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించే చిత్రాలకు సూపర్ హై బడ్జెట్ హోదా కల్పించబోతున్నారు. అంతేకాకుండా నిబంధనల ప్రకారం పెంచి అమ్మిన టికెట్లలోను, లాభాలలో 20 శాతం తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ ఫిలిం ఫెడరేషన్కు జమ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధుల ద్వారా చిత్ర పరిశ్రమంలోని కార్మికుల సంక్షేమానికి ఇతర అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తోంది. మరి తాజా నిర్ణయాలతో అటు థియేటర్ యాజమాన్యాలు ఇటు చిన్న చిత్రాల నిర్మాతలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you