Lenin trailer: అక్కినేని అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse )జంటగా వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం లెనిన్. ఈ సినిమా ఎన్నోసార్లు విడుదల విషయంలో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు జూలై 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటువంటి తరుణంలో చిత్ర బృందం ఈ రోజున వైజాగ్ లో ట్రైలర్ ని మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేశారు. ఈ సినిమాని మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
లెనిన్ ట్రైలర్ రిలీజ్..
తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే.. ఇది మహాభారతం చిత్తూరు జిల్లాలో ప్రతి ఏడాది ఎంతో బాధ్యతగా 18 రోజులపాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకు ఉన్న ఒకే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితులలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చిందించకూడదు అనే డైలాగుతో మొదలవుతుంది. కురుక్షేత్రం, వంటి పురాణ ప్రస్తావన తీసుకువస్తూ ఆధునిక గ్రామీణ రాజకీయాలు వర్గ పోరాటాలకు ముడి పెడుతూ మరీ డైరెక్టర్ మురళీకృష్ణ ఈ సినిమా కథను అద్భుతంగా ఆవిష్కరించబోతున్నట్లు కనిపిస్తోంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు అంటూ బ్యాక్గ్రౌండ్ లో నాగార్జున చెప్పిన వాయిస్ హైలెట్గా నిలిచింది. ఈ సినిమా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో అఖిల్(Akhil Akkineni) ,భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అవునట్లుగా కనిపిస్తోంది.
ALSO READ:Jabardast: జబర్దస్త్ యాంకర్ గా రష్మీకి ఎలా అవకాశం వచ్చిందంటే?
లెనిన్ నటీనటులు..
లెనిన్ సినిమాలో కీలకమైన పాత్రలో సునీల్, శివాజీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. చివరిలో అఖిల్ ఎమోషనల్ గా అందరిని ఆకట్టుకున్నట్లు ట్రైలర్లో చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. మరి ట్రైలర్ తోనే అదరగొట్టేసిన లెనిన్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే జులై 10వ తేదీ వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ట్రైలర్ ట్రెండీగా మారింది.
ALSO READ:Samantha:సమంత బ్లాక్ బాస్టర్ మా ఇంటి బంగారం.. ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే..?
అఖిల్ ఈసారైనా సక్సెస్ అందుకుంటారా?
లెనిన్ సినిమాతో అటు భాగ్యశ్రీ బోర్సే, అఖిల్ ఇద్దరు కూడా సక్సెస్ అందుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. అఖిల్ 2023లో చివరిగా ఏజెంట్ సినిమాలో నటించగా ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకటుకుంది. భాగ్యశ్రీ బోర్సే చివరిగా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించగా ఈ సినిమా పరవాలేదు అనిపించింది. ప్రస్తుతం సియోన్ అనే తమిళ సినిమాలో కూడా నటిస్తోంది.


