Friday, July 10, 2026
HomeLATESTOTT: కర్మకాలి మీ ఫోన్‌లోనూ ఇలా జరిగితే..? ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్న సస్పెన్స్ సిరీస్..!

OTT: కర్మకాలి మీ ఫోన్‌లోనూ ఇలా జరిగితే..? ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్న సస్పెన్స్ సిరీస్..!

OTT:మీ ఫోన్‌లో కూడా ఇలాంటి కాల్ వస్తే ఏం జరుగుతుంది? ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కథ, ట్విస్టులు, స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

OTT:వీకెండ్ వచ్చిందంటే చాలు.. టీవీల్లో సినిమాలు చూడడానికి, ఓటీటీ (OTT)ప్లాట్‌ఫామ్‌లలో సిరీస్‌లు చూడడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వారం అంతా కష్టపడి, వారాంతంలో కొంచెం రిలాక్స్ అవుదాం అంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి టీవీలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక చాలామంది వెబ్ సిరీస్‌లకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ వారంలో చాలా సినిమాలు, సిరీస్‌లు విడుదలైనా.. ఒకే ఒక్క వెబ్ సిరీస్ మాత్రం టాప్ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

మొబైల్ హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో కథ:

మొబైల్ ఫోన్ హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ఊహించని రేంజ్‌లో భారీ వ్యూయర్‌షిప్ రావడమే కాకుండా, చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్షన్‌ను ప్రశంసిస్తున్నారు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐఎండీబీలో టాప్ ర్యాంకింగ్, మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ వెబ్ సిరీస్ పేరు ‘ప్రీతమ్ అండ్ పెడ్రో'(PREETHAM AND PEDRO). ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

- Advertisement -

ALSO READ:Allu Arjun-Lokesh Movie: పుష్పరాజ్‌ను మించే అవతార్‌లో బన్నీ.. లుక్ టెస్ట్‌పై క్రేజీ అప్డేట్..!

కథలో అసలు ట్విస్ట్ ఇదే:

ఈ క్రైమ్ థ్రిల్లర్ కథ విషయానికి వస్తే..గోవాలో తన తాతయ్యతో కలిసి జీవిస్తూ ఉంటాడు ప్రీతమ్. ఆయన వాక్యూమ్ క్లీనర్ సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తూ ఉంటాడు. ఒక రోజు తన తాతకు ఎంతో ఇష్టమైన టేప్ రికార్డర్ కనిపించకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు.అక్కడ పెడ్రో అనే వ్యక్తి పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ప్రీతమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలోనే అక్కడికి ఒక హై ప్రొఫైల్ ఏటీఎం దొంగతనం కేసు వస్తుంది. ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది.సిరీస్ చూసేటప్పుడు “ఇదేముంది కొత్తగా?” అని అనిపించొచ్చు. కానీ కథలోపలికి వెళ్తే మాత్రం వరుస ట్విస్టులు ఎదురవుతాయి. ఆ కేసును ఎలా ఛేదించాలో అర్థం కాక పోలీసులు తీవ్రంగా సతమతమవుతూ ఉంటారు.

- Advertisement -

ALSO READ:Vk.Naresh:రావణ్ అరెస్టు ఎఫెక్ట్.. సోషల్ మీడియా యూజర్లకు నరేష్ సీరియస్ వార్నింగ్..!

పది నిమిషాల్లోనే దొంగలను పట్టేసిన ప్రీతమ్:

అప్పుడు ప్రీతమ్ చాలా తెలివిగా, “నా టేప్ రికార్డర్ తెచ్చిపెడితే.. ఏటీఎం దొంగలను పట్టుకుంటాను” అంటూ పోలీసులతో ఓ డీల్ చేసుకుంటాడు. మొదట ఇది పోలీసులకు విచిత్రంగా అనిపించినా, దొంగలు దొరికితే చాలు అనుకుని అతనికి అవకాశం ఇస్తారు. ప్రీతమ్ చెప్పినట్లుగానే తన కంప్యూటర్‌ను ఉపయోగించి కేవలం పది నిమిషాల్లోనే ఏటీఎం దొంగలను పట్టేస్తాడు. అలా సైబర్ కేసుల విచారణలో భాగంగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయి. ఇదే కథలోని అసలైన ట్విస్ట్.

- Advertisement -

మంత్రి కుమారుడి కిడ్నాప్‌తో మలుపు:

సరిగ్గా అదే సమయంలో క్రీడల మంత్రి కుమారుడు అదృశ్యమవుతాడు. అక్కడి నుంచి అసలైన కథ ప్రారంభమవుతుంది. అసలు ప్రీతమ్ గతం ఏంటి? ఏటీఎం దొంగలను క్షణాల్లోనే ఎలా పట్టుకున్నాడు? ఎందుకు టెక్నాలజీని వదిలేసి సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు? మంత్రి కుమారుడిని ఎందుకు కిడ్నాప్ చేశారు? అతడు కిడ్నాప్ అయిన తర్వాత ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ తప్పకుండా చూడాల్సిందే. క్షణక్షణం ఉత్కంఠభరితంగా, ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ వెబ్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చేస్తుంది. ముఖ్యంగా ట్విస్టులు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి.

రాజ్‌కుమార్ హిరానీ టచ్.. అందుకే సూపర్ హిట్:

ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఈ సిరీస్‌కు స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. అందుకే ఈ సిరీస్ అంతగా హిట్ అయింది. ఈ సిరీస్‌కు అవినాష్ దర్శకత్వం వహించారు. మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉండగా, ప్రతి ఎపిసోడ్ సూపర్ సస్పెన్స్‌తో సాగుతుంది. ప్రీతమ్ పాత్రలో నటించిన హీరో, అలాగే పెడ్రో పాత్రలో పోలీస్ అధికారి పాత్ర పోషించిన హర్షద్ వర్సీ తమ నటనతో ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఈ సిరీస్ మరో లెవెల్‌లో కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you