Rashmika mandanna:తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన రష్మిక ప్రస్తుత మైసా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా అన్ని హంగులను పూర్తిచేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 కి అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జునతో పాటుగా పదిమంది కంటెస్టెంట్లతో కూడా ఆమె చాలా సరదాగా మాట్లాడారు.
ఏంటి.. ముఖేష్ , రష్మిక సీనియరా?
ఈ సందర్భంగా రష్మిక ఒక పెద్ద విషయాన్ని తెలియజేసింది.. బిగ్బాస్ తెలుగు సీజన్ 10 రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ముఖేష్ గౌడ తాను రష్మికకు కాలేజీ సీనియర్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఆదివారం ఎపిసోడ్లో భాగంగా నాగార్జున హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కు హీరోయిన్ రష్మికాని పరిచయం చేయగా ముకేష్ ని ఉద్దేశించి నాగార్జున రష్మిక వచ్చింది.. ఆమెతో మీకు నచ్చిన మైసూరు, కన్నడలో గానీ , బెంగళూరు కన్నడలో గాని మాట్లాడొచ్చు అంటూ తెలియజేశారు.. దీంతో ముఖేష్ రష్మిక(Rashmika mandanna) తో నువ్వు నా కాలేజీలో జూనియర్ వి అంటూ చెప్పారు. ఇది విన్న రష్మిక ఒకసారిగా ఆశ్చర్యపోయింది.. ముఖేష్ ..నా స్నేహితులు నీతోపాటు చదువుకునే వారు నేను నిన్ను అక్కడ చూశాను అంటూ గుర్తు చేశారు.
also read:Kavya – Anirudh:కావ్య మారన్- అనిరుధ్ పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?
రష్మిక సర్ప్రైజ్ చేసిన ముఖేష్..
మిమ్మల్ని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందంటూ ముఖేష్ గౌడ చెప్పడంతో రష్మిక తన సంతోషాన్ని మరింత వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ విషయంలో ముఖేష్ కి కూడా శుభాకాంక్షలు తెలియజేసింది రష్మిక. రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అంటే తనకు బాగా ఇష్టమని తెలియజేశారు ముఖేష్ గౌడ.. దీంతో రష్మిక మీరు బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక కచ్చితంగా మైసా సినిమా చూడండి నేను అందులో యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా నటించాను అంటూ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:Ananya Sharma:దేవుడంటే నమ్మకం లేదు.. నటి అనన్య కామెంట్స్..!
వైరల్ అవుతున్న పోస్ట్..
ఇదంతా ఇలా ఉండగా.. రష్మిక సంభాషణ గురించి ఆమె కాలేజ్ విషయాలను గురించి ముకేశ్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిర్వహిస్తున్న ఒక టీం ప్రత్యేకించి మరి పోస్ట్ షేర్ చేసింది. రష్మిక, ముఖేష్ కన్నడలో ఎంతో ఆప్యాయకరంగా మాట్లాడుకుంటున్నారని అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏమిటంటే రష్మిక గారు ముఖేష్ కి కాలేజీ జూనియర్ అని బిగ్ బాస్ వేదిక పైన కలుసుకోవడం ఇది ఒక అద్భుతమైన క్షణం అంటూ ఆ పోస్టులు రాసుకొచ్చారు. మరి రష్మిక తో ఈ విషయం ముఖేష్ గౌడ కు మరింత కలిసి వచ్చే అవకాశాలు ఉందంటూ పలువురు అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది రణబాలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రష్మిక ఇప్పుడు మైసా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.




