OTT: ఇటీవల విడుదలైన ‘దురంధర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. ‘దురంధర్’ సినిమా దేశభక్తి, యాక్షన్స్ అన్నివేశాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదే తరహాలో సస్పెన్స్ స్పై ఆపరేషన్ భావోద్వేగాలను కలగలిగిన మరో వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ(OTT)లో మంచి ఆదరణ పొందుతుంది. దేశం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన ఒక భారత గూడచారి కథను ఈ సిరీస్ ఎంతో ఆసక్తికరంగా చూపిస్తుంది. కొన్ని వాస్తవ సంఘటనాల ఆధారంగా రూపొందిన ఈ స్పై సిరీస్ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచుతుంది.
భారత్ కోసం ప్రాణాలను పరంగా పెట్టిన మిషన్ :
ఈ కథ 1962 భారత్ – చైనా యుద్ధం అనంతరం పరిస్థితులతో ప్రారంభమవుతుంది. యుద్ధం కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి బలహీనపడిన సమయంలో పాకిస్తాన్ భారత్ పై రహస్య వ్యూహాలు రచిస్తుంది. ఈ కుట్రను గుర్తించిన భారత ఇంటెలిజెన్సీ అధికారులు ఒక తెలివైన చిన్న స్థాయి దొంగని ఎంపిక చేస్తారు. అతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి “హర్ఫాన్” అనే కొత్త గుర్తింపుతో పాకిస్తాన్ లోని లాహోర్ కి పంపిస్తారు.
ALSO READ:“RAW NTR మూసేస్తున్నాం”..సోషల్ మీడియా సెగతో చేతులెత్తేసిన సంస్థ..!
ప్రేమ-బాధ్యతల మధ్య సంఘర్షణ:
లాహోర్ చేరుకున్న “హర్ఫాన్” తన చాకచక్యంతో పాకిస్తాన్ సైనిక వర్గాలకు దగ్గరవుతాడు. తన అసలు వ్యక్తిత్వాన్ని ఎక్కడ బయటపడనీయకుండా అత్యంత ప్రమాదకరమైన మిషన్ ని కొనసాగిస్తాడు. ఇదే సమయంలో “జమీల” అనే యువ జర్నలిస్టు కుమార్తెతో ప్రేమలో పడతాడు. ఒకవైపు దేశ బాధ్యత మరోవైపు ప్రేమ మధ్య అతడు ఎదుర్కొనే సంఘర్షణ కథలో కీలక మలుపులను తీసుకువస్తుంది. పరిస్థితులు క్రమంగా అతడికి వ్యతిరేకంగా మారడంతో మిషన్ విజయవంతం అవుతుందా..? లేదా..? అనే ఉత్కంఠ మరింత పెరుగుతుంది
ప్రకాష్ రాజ్ కీలకపాత్ర.. ఓటీటీలో మంచి స్పందన :
ఈ సిరీస్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. హిందీతో పాటు తెలుగు సహ పలు భారతీయ భాషలలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. దేశభక్తి, గూడచారి ఆపరేషన్స్ ,భావోద్వేగాలు యాక్షన్ అంశాలను ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ జాయింట్ డైరెక్టర్ మలోయ్ కృష్ణ ధర్ రచించిన ‘మిషన్ టు పాకిస్తాన్’ నవల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ముఖ్బీర్: ది స్టోరీ ఆఫ్ ఎ స్పై’. దేశభక్తి, గూఢచారి ఆపరేషన్లు, ఉత్కంఠభరితమైన యాక్షన్తో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్ ప్రస్తుతం జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్లోనూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.
ALSO REA: The Odyssey:’ది ఒడిస్సీ’లో నటించే అదృష్టం.. చేతుల్లారా మిస్ చేసుకున్న మన స్టార్ హీరో ఇతడే!?
Har mission ke peeche hoti hai ek mastermind ki soch, aur Moorthy woh naam tha jisne namumkin ko mumkin kar dikhaya.
Dekhiye Mukhbir – The Story Of A Spy – The Movie, only on Hindi Zee 5.#MukhbirTheMovie #MukhbirOnlyOnZee5 pic.twitter.com/DPNyBvsuhk
— ZEE5Official (@ZEE5India) July 21, 2026




