Tollywood:తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల విడుదల తేదీలు వరుసగా మారుతున్నాయి. 2025, 2026లో ప్రేక్షకులు ముందుకు రావలసిన పలువురు స్టార్ హీరోల సినిమాలు వివిధ కారణాల చేత 2027 కి వాయిదా పడుతున్నాయి. దీంతో 2027లో ఇండియన్ (Tollywood) బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
“స్పిరిట్” కోసం అభిమానుల నిరీక్షణ:
రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “స్పిరిట్” పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని నిజానికి 2026 లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో షూటింగ్ షెడ్యూల్ ఆలస్యమైంది. దీంతో చిత్ర బృందం విడుదల తేదీన 2027 మార్చి 5న అధికారికంగా ప్రకటించింది.
also read:OTT: పాకిస్తాన్‌లో అండర్‌కవర్ మిషన్..మధ్యలో ప్రేమ..ప్రతి ఎపిసోడ్ గూస్‌బంప్స్ ఇచ్చే స్పై థ్రిల్లర్!
ఎన్టీఆర్ “డ్రాగన్”.. “వారణాసి” కూడా 2027 లోనే:
జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “డ్రాగన్” సినిమా విడుదల తేదీ ఇప్పటికే రెండుసార్లు మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు భారీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “వారణాసి” చిత్రాన్ని కూడా 2027 ఏప్రిల్ 7 న విడుదల చేయాలి అని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
also read:“RAW NTR మూసేస్తున్నాం”..సోషల్ మీడియా సెగతో చేతులెత్తేసిన సంస్థ..!
విఎఫ్ఎక్స్ కారణంగా “రాకా” ఆలస్యం :
భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న అల్లు అర్జున్ “రాకా” సినిమా విడుదలపై ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ సినిమా 2027 డిసెంబర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్.బి.కె 111 కు బ్రేక్.. సంక్రాంతి పోటీ ఆసక్తికరం:
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్బికె 111 షూటింగ్ కు అనుకొని అంతరాయం ఏర్పడింది. షూటింగ్లో బాలయ్యకు గాయం కావడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది క్రిస్మస్ కి రావాల్సిన ఈ సినిమా 2027 కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక రాబోయే సంక్రాంతి బాక్స్ ఆఫీస్ పోటీ కూడా ఆసక్తికరంగానే మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీతో పాటు చిరంజీవి – బాబి కాంబినేషన్లో తెరకెక్కే చిత్రం కూడా అదే సీజన్ లక్ష్యంగా పెట్టుకునింది. 2027లో వరసగా స్టార్ సినిమాలు విడుదల కారణడంతో భారతీయ బాక్సాఫీస్ కు అది అత్యంత కీలకంగా మారే అవకాశాలు కల్పిస్తున్నాయి.




