Jana Nayagan:స్టార్ హీరో సినిమాలలో చిన్న పాత్ర అయినా సరే దక్కాలి అని కోరుకుంటూ ఉంటారు కొంతమంది నటీమణులు. ఎన్ని చిన్న సినిమాలల్లో నటించిన పెద్ద స్టార్ హీరో సినిమాలో ఒక్కసారి నటిస్తే చాలు ఆ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ కారణంగానే బిగ్ బడా స్టార్ హీరోల సినిమాలలో చిన్న పాత్ర వచ్చిన అస్సలు మిస్ చేసుకోరు. అయితే కొన్నిసార్లు అవకాశం దక్కిన అదృష్టం కలిసి రాలేకపోవచ్చు. ప్రస్తుతం తమిళనటి ఆనంది అజయ్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు . దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన “జన నాయగన్” (Jana Nayagan)చిత్రంలో ఆమె నటించారు. కానీ కొన్ని సన్నివేశాలను చివరి నిమిషంలో తొలగించారట. దీంతో ఆమె ఎమోషనల్ కి గురవుతూ సోషల్ మీడియా వేదికగా కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోని రిలీజ్ చేశారు.
కన్నీటి వీడియోతో ఆవేదన :
ఆనంది అజయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తన మనసులోని బాధను మొత్తం వ్యక్తం చేశారు. “ఈ సినిమా కోసం నేను ఏడాది పాటు ఎంతో కష్టపడ్డాను ..అంకితభావంతో పనిచేశాను.. విజయ్ తో కలిసి నటించే అవకాశం దక్కడం నా కెరియర్ కి పెద్ద ప్లస్ అవుతుంది అనుకున్నాను. అయితే ఇప్పుడు నా సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారు” అని తెలిసి తీవ్ర నిరాశకు గురయ్యాను అని వెల్లడించారు.
also read:Jana Nayagan :జననాయగన్ సినిమా నటీనటుల రెమ్యూనరేషన్!
విజయ్ చివరి సినిమా కావడంతో మరింత బాధ:
విజయ్ పూర్తిస్థాయి రాజకీయాలలోకి వెళ్లాక “జన నాయగన్” ఆయన చివరి సినిమా కావచ్చు అనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఆయనతో మరోసారి కలిసిన నటించే అవకాశం దాదాపు ఉండదనే భావన నటీనటుల్లో అందరికీ ఉంది. అదే విషయాన్ని ఆనంది కూడా పేర్కొన్నారు. ఎంతో ఆశతో ఎదురుచూసిన అవకాశం ఇలా చేజారిపోవడం నాకు తీరని వేదనగా మిగిలింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
also read:Tollywood:ఎయిర్ పోర్ట్ లో గ్లామర్ స్టైల్ తో ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్!
నెటిజన్ల నుండి భారీ మద్దతు:
ఆనంది వీడియోకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. అభిమానులు, నటిజెన్లు ఆమెకు ధైర్యం చెప్పుతూ సందేశాలు పంపుతున్నారు. “ఇది మీ ప్రయాణంలో ఒక చిన్న అడ్డంకి మాత్రమే.. భవిష్యత్తులో ఇంకా పెద్ద అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి.. ధైర్యంగా ముందుకు సాగండి” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అభిమానుల మద్దతు ఆమెకు కొంత ఊరట ఇచ్చినట్లు తెలుస్తుంది.
https://www.instagram.com/reel/DbJF-GTzZuV/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==




