Chennai Love Story:కిరణ్ అబ్బవరం నటించిన “చెన్నై లవ్ స్టోరీ” (Chennai Love Story)ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఆకట్టుకుంటుంది. పూర్తిస్థాయి ప్రేమ కథగా రూపొందిన ఈ చిత్రం యూత్ ను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. దర్శకుడిగా ఎదగాలని కలలుకనే అనాధ యువకుడి జీవితం .. పెళ్లి మండపంలోనే వివాహం ఆగిపోయిన యువతి భావోద్వేగాల చుట్టూ ఈ కథ సాగుతుంది. ప్రేమ – భావోద్వేగాలు అనుబంధాలను ప్రధాన అంశాలుగా తీసుకొని రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రీమియర్స్ నుంచే భారీ స్పందన :
గురువారం నిర్వహించిన పెయిడ్ ప్రీమియర్స్ కి విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా టీనేజర్లు, కాలేజీ విద్యార్థులు సినిమాని ఆదరిస్తున్నారు. ప్రేమలో విఫలమైన వారి భావోద్వేగాలను హత్తుకునేలా కధ ఉండడంతో యువత ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతుంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.
ALSO READ:Manasa Varanasi: చీర కట్టులో సెగలు పుట్టిస్తున్న మానస వారణాసి!
మొదటి రోజు ఆకట్టుకున్న కలెక్షన్లు:
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రం రూ.3.13 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలి రోజు దేశీయంగా సుమారు రూ.4.40 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా..గ్రా వసూళ్లు ఐదు కోట్లకు చేరినట్లు తెలుస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి స్పందన లభించడంతో మొత్తం వసూలు రూ.7.5 కోట్లకు పైగానే నమోదు అయినట్లు ట్రేడ్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇవి కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే అత్యుత్తమ ప్రారంభ వసూలుగా చెబుతున్నారు సినీ ప్రముఖులు.
ALSO READ:Nagabandham: ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం!
బ్రేక్ ఈవెన్ పై ఆశలు :
ఈ చిత్రం నిర్మాణ వ్యయం సుమారు రూ.15 కోట్లుగా, థియేట్రికల్ బిజినెస్ రూ.23 కోట్లుగా జరిగినట్లు సమాచారం. ఓటిటి, ఆడియో హక్కుల ద్వారా కూడా మంచి ఆదాయం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. థియేటర్లలో పూర్తిస్థాయిలో లాభాలు అందుకోవాలి అంటే సుమారు 45 కోట్ల క్రాస్ వసూళ్లు అవసరమని అంచనా. ప్రస్తుతం ఉన్న పాజిటివ్ టాక్ కొనసాగితే ఈ లక్ష్యాన్ని సినిమా ఇది ఈజీగా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నటీనటుల నటనకు ప్రశంసలు :
ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రలో నటించగా.. త్రిగుణ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు సాయి రాజేష్ కధ అందించారు. భావోద్వేగ సన్నివేశాలలో కిరణ అబ్బవరం నటనకు ప్రశంసలు దక్కుతుండగా ..గౌరీ ప్రియ పాత్ర కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకుల అభిప్రాయపడుతున్నారు.




