Sunday, July 26, 2026
HomeLATESTOTT:బిచ్చగాడు మూవీ హీరో నటించిన..వంద దేవుళ్లు ఏ ఓటీటిలో చూడొచ్చు అంటే?

OTT:బిచ్చగాడు మూవీ హీరో నటించిన..వంద దేవుళ్లు ఏ ఓటీటిలో చూడొచ్చు అంటే?

OTT:విజయ్ ఆంటోనీ నటించిన సోషల్ ఫ్యామిలీ డ్రామా 'వంద దేవుళ్లు' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

OTT:బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో “విజయ్ ఆంటోని” నటించిన తాజా చిత్రం “వంద దేవుళ్ళు”.. త్వరలో ఓటిటి(OTT) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తమిళంలో “నోరు స్వామి” పేరుతో విడుదలైన ఈ సోషల్ ఫ్యామిలీ డ్రామాను తెలుగులో “వంద దేవుళ్లుగా” డబ్ చేశారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన మలయాళి నటి శ్వాసిక విజయన్ కథానాయికగా నటించారు. అజయ్ దిశన్, లిజోమోల్ జోస్, కరుణాకరన్, మునిష్‌కాంత్, బాలాజీ శక్తివేల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డైరెక్టర్ శశి దర్శకత్వం వహించిన వంద దేవుళ్లు సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ నిర్మించాయి.

తల్లి జీవితంపై హృదయాన్ని తాకే కథ :

జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. నిజజీవిత సంఘటన స్ఫూర్తితో రూపొందిన ఈ కథలో 40 ఏళ్లు దాటిన ఓ ఒంటరి తల్లి జీవితాన్ని ప్రధానంగా చూపించారు. తన తల్లికి మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకునే కొడుకు నిర్ణయం చుట్టూ కథ సాగుతుంది. అయితే సమాజం బంధువుల నుంచి ఎదురయ్యే విమర్శలను ఎదుర్కొంటు తల్లి కొడుకుల బంధం ఎలా నడిచింది అనేది చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

- Advertisement -
Advertisement

ALSO READ:Chennai Love Story:కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’కి తొలి రోజు కలెక్షన్స్!

మహిళల భావోద్వేగాలకు అద్దం పట్టిన సినిమా :

వివాహం, మాతృత్వం, త్యాగం, ఒంటరితనం మహిళలపై సామాజిక సమస్యలు వంటి అంశాలను ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా చూపించింది. ముఖ్యంగా తల్లి చేసిన త్యాగాలను గుర్తించి ఆమె సంతోషానికి అండగా నిలిచే కొడుకు పాత్ర ప్రేక్షకులను కదిలించింది. సహజమైన నటన, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. ఈ కారణంగానే IMDB 7.7లో రేటింగ్ కూడా సొంతం చేసుకుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Manasa Varanasi: చీర కట్టులో సెగలు పుట్టిస్తున్న మానస వారణాసి!

ZEE5 లో నాలుగు భాషలలో విడుదల:

విజయ్ ఆంటోని (Vijay Antony)పుట్టినరోజు సందర్భంగా వంద దేవుళ్ళు ఓటిటి విడుదలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ వేదిక ZEE5లో ఈ చిత్రం ఆగస్టు నెలలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కానుంది. అయితే విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి ఎంపికగా నిలుస్తుందని సినీవర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you