TV:తెలుగు బుల్లితెరపై ఎన్నో జంటలతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే కొందరి విషయంలో ఆ అనుబంధం నిజజీవితంలోనూ ఉందనే ప్రచారం తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలాంటి జంటలలో నవ్య స్వామి, రవకృష్ణ పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నప్పటికీ.. తాము మంచి స్నేహితులమేనని ఇద్దరు పలుమార్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ వీరి గురించి వచ్చే ఊహగానలు మాత్రం ఆగడం లేదు.
కలిసి కనిపించినప్పుడల్లా ఒకటే చర్చ:
“కథ” సీరియల్ లో జంటగా నటించిన నవ్య స్వామి, రవకృష్ణకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత కూడా పలు టెలివిజన్ ((TV) కార్యక్రమాలు, ప్రత్యేక ఈవెంట్లలో ఇద్దరు కలిసి కనిపించడంతో వీరి మధ్య ప్రత్యేక బంధం ఉందనే ప్రచారం మరింత బలపడింది. సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేస్తే మరొకరు వెంటనే స్పందించడం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
also read:akkineni family:”మా ఇంటి సంప్రదాయం అదే”..ఆస్తి తగాదాలపై అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో ఆసక్తికర సీన్:
తాజాగా ప్రసారానికి సిద్ధమైన “ఆదివారం విత్ స్టార్ మా పరివారం” కార్యక్రమం ప్రోమోలో నవ్య స్వామి(Navya Swamy ), రవి కృష్ణ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ఎపిసోడ్లో శ్రీముఖి వీరిద్దరికి ఒక సరదా టాస్క్ ఇచ్చింది. ఒకరినొకరు పేరు పెట్టి కాకుండా ఎలా పిలుచుకుంటారో బోర్డ్ ల పై రాయాలని చెప్పగా నవ్య స్వామి, రవకృష్ణని “హీరో” అని రాయగ రవికృష్ణ, నవ్యాను “రౌడీ ఫెలో” అని రాశాడు.
also read:Avika Gor: పింక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న అవికా గోర్!
నవ్య కామెంట్ తో మళ్ళీ మొదలైన చర్చ :
ఈ టాస్క్ తర్వాత రవికృష్ణ(Ravi Krishna) నా దృష్టిలో ఎప్పటికీ “హీరోనే” అని నవ్య స్వామి చెప్పడం స్టూడియోలో నవ్వులు పూయించింది. అదే సమయంలో అక్కడ ఉన్నవారు కూడా ఈ వ్యాఖ్య పై సరదాగా స్పందించారు. ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరు మధ్య ఉన్న అనుబంధం పై నెటిజెన్లు మరోసారి చర్చలు మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు నవ్య స్వామి లేదా రవికృష్ణ తమ రిలేషన్షిప్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇప్పటికీ కేవలం ఊహాగానాలు గానే మిగిలాయి. పూర్తి ఎపిసోడ్ ప్రసారమైన తర్వాత ఈ జంట గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి ఏమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!




