OTT:బత్తుల పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పురుష:’ (Purusha OTT) చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోష్‌ను కొనసాగిస్తోంది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పించగా, వీరు వులవల దర్శకత్వం వహించారు. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమాలో సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కుటుంబ ప్రేక్షకుల ప్రశంసలు:
మే 22న విడుదలైన ఈ చిత్రం వినోదంతో పాటు కుటుంబ బంధాలు, భావోద్వేగాలను సమతుల్యంగా ఆవిష్కరించడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా మహిళలు, కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడంతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. హీరో బత్తుల పవన్ కళ్యాణ్ తన పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకోగా, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ అందించిన కామెడీ ప్రేక్షకులకు నవ్వులు పంచింది. అలాగే రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ తమ పాత్రలకు న్యాయం చేస్తూ సినిమాకు మరింత బలం చేకూర్చారు. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్లకు కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది.
also read:TV:ప్రేమ వార్తలకు మరోసారి ఊపిరి పోసిన నవ్య-రవికృష్ణ.. వైరల్ అవుతున్న ప్రోమో!
ఓటీటీలో ట్రెండింగ్‌లో ‘పురుష:
థియేట్రికల్ రన్ పూర్తయిన అనంతరం ఈ చిత్రం ఇటీవల ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో కూడా మంచి వ్యూయర్‌షిప్‌ను నమోదు చేస్తూ ట్రెండింగ్ జాబితాలో స్థానం సంపాదించింది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో సినిమాను ఆస్వాదిస్తున్నారు.
also read:akkineni family:”మా ఇంటి సంప్రదాయం అదే”..ఆస్తి తగాదాలపై అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఎందుకు ఆదరణ పొందుతోంది?:
అసభ్యతకు తావులేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి వీక్షించేలా రూపొందించిన కథ, సరదా హాస్య సన్నివేశాలు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. అందుకే థియేటర్లలో సాధించిన విజయాన్ని డిజిటల్ వేదికలపై కూడా కొనసాగిస్తూ ‘పురుష:’ మరోసారి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సినిమా ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది.




