Monday, July 27, 2026
HomeLATESTDhanush:రాయన్ జాతీయ అవార్డు రచ్చ.. విమర్శకుల నోళ్లు మూయించేలా ధనుష్ రియాక్షన్..!

Dhanush:రాయన్ జాతీయ అవార్డు రచ్చ.. విమర్శకుల నోళ్లు మూయించేలా ధనుష్ రియాక్షన్..!

'Dhanush:రాయన్' చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై సోషల్ మీడియాలో చెలరేగిన వివాదంపై హీరో ధనుష్ తొలిసారి స్పందించారు. విమర్శలకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Dhanush:కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా జాతీయ చలనచిత్ర అవార్డుల నేపథ్యంలో నెలకొన్న వివాదం పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించి.. దర్శకత్వం వహించిన “రాయన్” చిత్రానికి జాతీయ అవార్డు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో తన పై వస్తున్న విమర్శలకు ధనుష్(Dhanush) పరోక్షకంగా సమాధానమిచ్చారు.

రాయన్ అవార్డుపై కొనసాగుతున్న చర్చ:

జాతీయ అవార్డుల ప్రకటన తర్వాత పలువురు సినీ అభిమానులు, నటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘మెయ్యళగన్’ (సత్యం సుందరం), ‘మహారాజ’ వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ వాటిని పక్కనపెట్టి ‘రాయన్’కు అవార్డు ఇవ్వడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. కధా, భావోద్వేగాలపరంగా ఇతర చిత్రాలు మెరుగ్గా ఉన్నాయని.. ధనుష్ వ్యక్తిగత గుర్తింపుని పరిగణలోకి తీసుకొని ఈ అవార్డు ఇచ్చారని సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి.

- Advertisement -
Advertisement

పాత అనుభవాలను గుర్తు చేసిన ధనుష్ :

ఈ విమర్శలపై స్పందించిన ధనుష్ ప్రస్తుతం వస్తున్న అభిప్రాయాలలో కొంత నిజం ఉన్నప్పటికీ గతంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరు ప్రశ్నించలేదని అన్నారు. తన కెరీర్‌లో వచ్చిన ‘పుదుపేట్టై’, ‘వడ చెన్నై’, ‘కర్ణన్’, ‘మరియాన్’, ‘రాంఝణా’ వంటి చిత్రాలు జాతీయ అవార్డులకు అర్హమైనవేనని, అయినప్పటికీ అవి గుర్తింపు పొందలేదని గుర్తుచేశారు.

also read:Sai Pallavi:సినీ ఇండస్ట్రీలో మరో సంచలనం..టాప్ హీరోయిన్లకు షాక్ ఇచ్చిన సాయిపల్లవి..!

- Advertisement -
Advertisement

అప్పుడు ఎందుకు ఎవ్వరు మాట్లాడలేదు:

తన మాటల్లో..” ప్రస్తుతం చాలామంది రాయన్ కి అవార్డు రావడానికి ప్రశ్నిస్తున్నారని.. కానీ గతంలో నిజంగా అవార్డు రావాల్సిన తన సినిమాలు గుర్తింపు కోల్పోయినప్పుడు కనీసం కొంతమంది కూడా తనకు మద్దతు నిలబడలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు విమర్శిస్తున్న వారిలో చాలామంది అప్పట్లో మౌనం పాటించారని ఆయన పరోక్షంగా తెలిపారు.

also read:Pooja Hegde:పూజా హెగ్డే ఇల్లు చూశారా?

- Advertisement -
Advertisement

ప్రోత్సాహమే కావాలి ధనుష్ :

తాను ఎవరిని తప్పు పట్టడం లేదు అని స్పష్టం చేసిన ధనుష్ .. ఒక కళాకారుడిగా విమర్శల కంటే ప్రోత్సాహమే ఎక్కువ అవసరమని చెప్పారు. మంచి సినిమాలు చేసినప్పుడు ప్రేక్షకుల ఆదరణ గుర్తింపు కళాకారులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు మరియు సినీ ప్రియులు తమదైన శైలిలో స్పందిస్తూ చర్చను మరింత ముందుకు తీసుకెళుతున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you