Monday, July 27, 2026
HomeLATESTTollywood:టాలీవుడ్‌లో కొత్త చరిత్ర.. తెలుగు హీరోయిన్ల జోరు..!

Tollywood:టాలీవుడ్‌లో కొత్త చరిత్ర.. తెలుగు హీరోయిన్ల జోరు..!

Tollywood:ఒకప్పుడు పరభాషా హీరోయిన్ల ఆధిపత్యం ఉన్న టాలీవుడ్‌లో ఇప్పుడు తెలుగు అమ్మాయిలే కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. సహజమైన నటన, కథల ఎంపిక, ప్రతిభతో ఇండస్ట్రీ రూల్స్ మార్చేస్తూ స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు.

on
- Advertisement -banner Ad

Tollywood:ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల జాబితాలో ఎక్కువగా ఇతర భాషలకు సంబంధించిన నటీమణులే కనిపించేవారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేటివి దీని గురించి చాలా చాలా రాధాంతాలు కూడా జరిగాయి . తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇచ్చిన అవి చిన్న పాత్రలకే పరిమితమయ్యేవి. అయితే గత కొన్ని నెలలుగా పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు స్థానిక నటీమణులు తమ సహజమైన నటన పాత్రల ఎంపికతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. అందం మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఎంచుకుంటూ వారు తమ ప్రతిభను నిరూపిస్తున్నారు.

వరుస విజయాలతో దూసుకెళుతున్న యువ నటీమణులు

వైష్ణవి చైతన్య, శ్రీ గౌరీ ప్రియ, ఫరియా అబ్దుల్లా, తేజస్వి రావు వంటి యువ కథానాయకులు వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన వైష్ణవి చైతన్య తన సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది, భావోద్వేగా ప్రధాన పాత్రల్లో ఆమె చూపిస్తున్న ప్రతిభ ప్రశంసలు అందుకుంటుంది. మరోవైపు శ్రీ గౌరీ ప్రియ కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇక ఫరియా కూడా విభిన్న పాత్రలతో తన ప్రత్యేకతను చాటుకుంటుంది.

- Advertisement -
Advertisement

also read:TV:స్టార్టప్ నుంచి మళ్లీ యాక్టింగ్‌కి.. చామంతి సీరియల్‌ నటి ఐశ్వర్య వర్మ లైఫ్‌లో జరిగిన ట్విస్ట్ ఇదే!

టాలీవుడ్ లో మారుతున్న సమీకరణాలు:

ప్రస్తుతం దర్శకులు నిర్మాతలు కూడా స్థానిక ప్రతిభ ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నారు. కంటెంట్ ఆధారిత సినిమాలు పెరగడంతో తెలుగు నటీమణులకు మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి. పాత్రకు న్యాయం చేయగల నటి కోసం మేకర్స్ తెలుగు అమ్మాయిల వైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దీంతో కొత్త తరం కథానాయకులు తమ ప్రతిభతో పరిశ్రమలో బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు.

- Advertisement -
Advertisement

also read:Dhanush:రాయన్ జాతీయ అవార్డు రచ్చ.. విమర్శకుల నోళ్లు మూయించేలా ధనుష్ రియాక్షన్..!

భవిష్యత్తుకు స్ఫూర్తిగా తెలుగు కథానాయకులు:

తెలుగు(Tollywood) నటీమణులు ఈ విజయాలు వ్యక్తిగత కెరియర్ కే పరిమితం కావడం లేదు. రాబోయే తరానికి కూడా కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. గ్లామర్ కే పరిమితం కాకుండా నటనతో ప్రేక్షకులను మెప్పించగల సామర్థ్యం తమకు ఉందని వారు నిరూపిస్తున్నారు. ఈ మార్పు టాలీవుడ్ కి కొత్త దిశను చూపించడమే కాకుండా భవిష్యత్తులో మరి కొంతమంది తెలుగు అమ్మాయిలు కథానాయకులుగా రాణించే అవకాశాలను పెంచుతుంది. దీంతో తెలుగు ప్రతిభకు సిల్వర్ స్క్రీన్ పై మరింత గుర్తింపు దక్కే రోజులు ముందున్నాయని అభిప్రాయం సినీ వర్గాలలో వ్యక్తం అవుతుంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you