ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఈ మధ్యకాలంలో విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
చివరిగా ప్రియదర్శితో కలిసి డార్లింగ్ సినిమా చేసిన ఈమె.. ఇక ఈ మధ్య నాగబంధం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమా పరవాలేదనిపించుకుంది.
ఇక ఇప్పుడు నిఖిల్ తో కలిసి స్వయంభు సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నాగబంధం తర్వాత కాస్త గ్యాప్ దొరకడంతో వెకేషన్ కి వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ.
వెకేషన్ లో భాగంగా చిట్టి పొట్టి బట్టలు ధరించి తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.తన ఫ్యామిలీతో కలిసి ఈ వెకేషన్ ను సరదాగా ఎంజాయ్ చేస్తోంది.
తాజాగా అక్కడి నుండి ఫోటోలను పంచుకున్న ఈమె.. తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి డిన్నర్ డేట్ కి కూడా వెళ్ళింది.
అంతేకాదు బంధువుల పెళ్లిలో సందడి చేసింది. మొత్తానికి అయితే నభా నటేష్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.