Monday, July 27, 2026
HomeLATESTAdipurush: ఆదిపురుష్ విషయంలో చాలా తప్పు చేశా.. రచయిత షాకింగ్ కామెంట్స్..!

Adipurush: ఆదిపురుష్ విషయంలో చాలా తప్పు చేశా.. రచయిత షాకింగ్ కామెంట్స్..!

Adipurush: ఆది పురుష్ సినిమాకి డైలాగ్స్ అందించిన ప్రముఖ రచయిత జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు అదే అంటూ కామెంట్లు చేశారు.

on
- Advertisement -banner Ad

Adipurush: పాన్ ఇండియా హీరో ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో వచ్చిన పౌరణిక భారీ బడ్జెట్ చిత్రం ఆది పురుష్. ఇందులో రాముడిగా ప్రభాస్ నటించగా, సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ సినిమా 2023లో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ముఖ్యంగా ఈ సినిమాతో దారుణమైన ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నది చిత్ర బృందం. వచ్చి మూడేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ డైరెక్టర్ ఓం రౌత్ ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమాకి పనిచేయడం తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అంటూ ప్రముఖ రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా తాజాగా తెలియజేశారు.

నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..

ఆది పురుష్(Adipurush)చిత్రానికి మనోజ్ రచయితగా పనిచేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా చేసినందుకు సిగ్గుపడుతున్నానని, మొదట్లో నేను విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ప్రజల ఆవేదన తనకు అర్థమయ్యింది.. ఆ సినిమా చేయడం నేను చేసిన అతి పెద్ద తప్పు అంటూ సమర్ధించడం కంటే పెద్ద తప్పే అంటూ తెలిపారు. అలా జరిగినందుకు దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెబుతున్నా.. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్లి ఆలోచిస్తే అసలు ఆ సినిమాలోని డైలాగ్స్ నేను ఎలా రాశానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.. చాలా సిగ్గుగా ఉంది అంటూ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Adarsha kutumbam:ఆదర్శ కుటుంబం సినిమా నుంచి చిట్టిబాబు వీడియో వైరల్..!

నా భార్య ముందుగానే హెచ్చరించింది..

శ్రీరాముడు, హనుమాన్ లాంటి పవిత్రమైన పాత్రలకు నేను న్యాయం చేయలేకపోయానని ఆ సమయంలో నేను మాట్లాడిన మాటలు చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని.. కానీ మా ఆవిడ సినిమాకి మద్దతుగా మాట్లాడొద్దంటూ ముందుగానే హెచ్చరించింది. ఆది పురుష్ సినిమా పై జనాలలో కూడా చాలా సందేహాలు వ్యక్తం అయ్యేలా చేసింది. సినిమా విడుదలకు ఆరు నెలల ముందే సోషల్ మీడియాలో చాలా దారుణమైన విమర్శలు కూడా వచ్చాయి ఆ సమయంలో నేను సినిమాని సమర్థిస్తూ మాట్లాడితే నాపైన చాలా వ్యతిరేకత వస్తుందని నా భార్య కూడా హెచ్చరించిందంటూ తెలిపారు మనోజ్.

- Advertisement -
Advertisement

also read:Nabha natesh: వెకేషన్ మోడ్.. ఫ్యామిలీ తో చిల్ అవుతున్న నభా నటేష్!

దయచేసి నన్ను క్షమించండి..

ఆది పురుష్ చిత్రంలో హనుమంతుడి పాత్రకు.. గుడ్డు నీ బాబుదే.. తైలం నీ బాబుదే వంటి డైలాగులు మనోజ్ రాశారు.. దానిపైన అప్పుడే అభ్యంతరాలు కూడా వచ్చాయి .. అసలు తాము తీసింది రామాయణమే కాదని ఆ డైలాగుల్లో తప్ప ఏమీ లేదంటూ వాదించారు.. హనుమంతుడు దేవుడే కాదని ఒక మంచి భక్తుడు అంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ విషయం పైన కొద్ది రోజులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ కూడా చేశారు. చాలామంది మనోభావాలను తాను గాయపరిచానని రెండు చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నానంటూ తెలిపారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you