Thursday, August 6, 2026
HomeLATESTOTT:గర్భిణీ నరబలి..పోలీసులకే సవాల్ విసిరిన మిస్టరీ.. ఓటిటిలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్!

OTT:గర్భిణీ నరబలి..పోలీసులకే సవాల్ విసిరిన మిస్టరీ.. ఓటిటిలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్!

OTT:వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

on
- Advertisement -banner Ad

OTT:కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటిటి (OTT)వేదికలపై మాత్రం దుమ్ము దులిపేస్తూ ఉంటాయి. ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేస్తూ ఉంటాయి. అలాంటి లిస్టులో ఎన్నెన్నో సినిమాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు “పోలీస్ కంప్లైంట్” సినిమా కూడా ఆ లిస్టులోకే చేరిపోయింది. పోలీస్ కంప్లైంట్ సినిమా ఇప్పుడు ఓటిటిలో దుమ్ము దులిపేస్తుంది. థియేటర్లలో రిలీజ్ అయ్యి పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని ఈ సినిమా ఓటీటీలో మాత్రం సూపర్ డూపర్ హిట్ గా ముందుకెళ్తుంది. డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల దృష్టిని సినిమా బలంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్, హర్రర్ అంశాల మేలవింపుతో రూపొందిన ఈ చిత్రం మంచి వ్యూయర్షిప్ ని నమోదు చేస్తుంది.

కథలో ఆసక్తికరమైన మలుపులు:

ఈ సినిమా కథ ఒక భయానక ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. ఇదే సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్. అమరత్వం కోసం మహంకాళి అనే క్రూర మాంత్రికుడు గర్భిణీ మహిళను నరబలి ఇచ్చేస్తాడు. ఈ దారుణ ఘటనను దాచి పెట్టేందుకు పోలీస్ అధికారి అదేవిధంగా అవినీతి డాక్టర్ అతనికి సహకరిస్తారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరిస్తూ తప్పుడు ఆధారాలతో కేసులు మూసివేస్తారు. అయితే కొన్ని సంవత్సరాలు తర్వాత కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఓ మహిళ పోలీస్ అధికారి ఆ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటుంది. ప్రారంభంలో సాధారణ కేసుల కనిపించిన ఈ ఘటన వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయి అని ఆమెకు తెలుస్తుంది. దీంతో దర్యాప్తు మరింత వేగవంతం చేస్తుంది. దర్యాప్తు ముందుకు సాగుతుండే కొద్ది కేసుతో సంబంధం ఉన్న ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్కరుగా బయటపడుతూ అనుమానస్పద స్థితిలో మరణించడం కథను మరింత ఉత్కంఠ భరితంగా మార్చేస్తుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Jabardasth:శ్మశానంలో లవ్ ప్రపోజ్ చేసిన జబర్దస్త్ కమెడియన్..

సస్పెన్స్ థ్రిల్లర్ల అభిమానులకు బెస్ట్ చాయిస్ :

ఈ వరుస మరణాల వెనుక అసలు నిందితుడు ఎవరు..? చేతబడి, హత్యలు, కుట్రల మధ్య నిజం ఎలా బయటపడింది..? చివరకు నేరస్తులు ఎలా చిక్కారు..? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా క్లైమాక్స్. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ఫుల్ పోలీస్ అధికారిని పాత్రలో ఆకట్టుకుంటుంది. ఇంకా పక్కాగా చెప్పాలి అంటే ఈ సినిమాకి కీలక ప్లస్ పాయింట్ వరలక్ష్మి శరత్ కుమార్ నటనే. నవీన్ చంద్ర , రాగిణి ద్వివేది, కృష్ణ సాయి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:ఈరోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల జాబితా..!

దర్శకుడు టాలెంట్ కి ఫిదా:

ప్రతి నటీనటులు కూడా వాళ్ళ పాత్రకు తగ్గ స్థాయిలో నటించి మెప్పించారు. దర్శకుడు సంజీవ్ మేకోటి సస్పెన్స్ చివరి వరకు కొనసాగించేలా కథను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. చాలా వెల్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లా ఆయన తెరకెక్కించిన విధానం అభిమానులను ఆశ్చర్యపరచక తప్పదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “పోలీస్ కంప్లైంట్” సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఉత్కంఠ భరితమైన క్రైమ్ ద్రిల్లర్ లను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..!!

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you