Saranya Nag:”టెన్త్ క్లాస్” ఈ సినిమాను అంత ఈజీగా మర్చిపోతారా..? జనాలు అప్పట్లో ఓ ఊపు ఊపేసిన సినిమా. ముఖ్యంగా హీరోయిన్ శరణ్య నాగ్ అంటే అప్పట్లో జనాలు పడి చచ్చిపోయే వాళ్ళు. ఇక కుర్రాళ్ళు అయితే ఏకంగా స్కూల్ బుక్స్ లో కాలేజ్ బుక్స్ లో ఆమె ఫోటో పేపర్లో వస్తే కట్ చేసి దాచుకునే వాళ్ళు. అంతలా పిచ్చెక్కించేసింది శరణ్య నాగ్. 2006లో విడుదలైన “టెన్త్ క్లాస్” ద్వారా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి శరణ్య నాగ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా రెమ్యూనరేషన్ గురించి ఓపెన్ గా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.
తొలి సినిమాకు 50 వేల పారితోషకం :
శరణ్య నాగ్ మాట్లాడుతూ..”టెన్త్ క్లాస్ సినిమాలో నటించినందుకు గాను తనకు 50 వేల పారితోషకం ఇచ్చారు” అని తెలిపింది. ప్రస్తుతం చూస్తే ఆ మొత్తం పెద్దగా అనిపించకపోయినా అప్పటి పరిస్థితుల్లో తమ కుటుంబానికి అది చాలా చాలా పెద్ద మొత్తమని గుర్తు చేసుకుంది. ముఖ్యంగా ఆ డబ్బు తన ఇంటికి ఎంతో ఉపయోగపడింది అని.. ఆ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితికి అది మంచి ఊరటని ఇచ్చింది అని చెప్పింది. శరణ్య తన ఇంటర్వ్యూలో భావోద్వేగంగా మాట్లాడుతూ..” చిన్న వయసులోనే తల్లికి తోడుగా నిలవాల్సిన పరిస్థితి వచ్చింది” అని వెల్లడించింది. అంతేకాదు తొలి సినిమా ద్వారా వచ్చిన 50 వేలుతో తన తల్లికి ఆర్థికంగా సహాయం చేయగలిగానని చెప్పింది. ఆ డబ్బు తన కుటుంబానికి ఎంతో విలువైనదిగా మారింది అని.. ఇప్పటికి ఆ జ్ఞాపకం తనకు ప్రత్యేకంగానే ఉంది అని పేర్కొంది.
ALSO READ:OTT:గర్భిణీ నరబలి..పోలీసులకే సవాల్ విసిరిన మిస్టరీ.. ఓటిటిలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్!
తొలి విజయం తర్వాత మరిన్ని అవకాశాలు:
టెన్త్ క్లాస్ సినిమా తర్వాత శరణ్య నాగ్ కి వరుసగా సినీ అవకాశాలు వచ్చాయి. తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాష చిత్రాలలో కూడా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆమె మాత్రం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేసింది. ఇప్పటికీ శరణ్య నాగ్ ని టెన్త్ క్లాస్ సినిమా చూసి ఇష్టపడిన వాళ్లు చాలామంది ఉంటారు.
ALSO READ:Jabardasth:శ్మశానంలో లవ్ ప్రపోజ్ చేసిన జబర్దస్త్ కమెడియన్..
అభిమానులను ఆకట్టుకున్న వ్యాఖ్యలు:
శరణ్య నాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతున్నాయి. చిన్న వయసులోనే సంపాదించిన తొలి పారితోషకం, కుటుంబ బాధ్యతలు పంచుకోవడం, తల్లికి అండగా నిలబడడం వంటి విషయాలను నెటిజెన్లు బాగా హైలైట్ చేస్తున్నారు. సినీ రంగంలో తొలి అడుగులతోనే కుటుంబానికి అండగా నిలిచిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. టెన్త్ క్లాస్ సినిమా హీరోయిన్ శరణ్య నాగ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ బ్యూటి..!!




